The South9
The news is by your side.

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ.. డీఎస్పీ శ్రీధర్‌కు అభినందనలు

post top

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ.. డీఎస్పీ శ్రీధర్‌కు అభినందనలు

 

ఒంగోలు:

ఒంగోలులో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం అందుకున్న డీఎస్పీ శ్రీధర్‌ను ద సౌత్ 9 మీడియా, వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ మనపాటి చక్రవర్తి అభినందించారు. పోలీస్ శాఖలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీధర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మనపాటి చక్రవర్తి, ఆయన సేవలను కొనియాడారు. సమాజ భద్రత కోసం పోలీస్ అధికారులు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

after image

అదేవిధంగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సేవా అవార్డు అందుకున్న మనపాటి చక్రవర్తిని డీఎస్పీ శ్రీధర్ అభినందించారు. సామాజిక సేవా రంగంలో ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు.

ఇదిలా ఉండగా, IBM ప్రొడక్షన్ హౌస్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ‘దసరా శుభాకాంక్షలు’ చిత్ర బృందం కూడా ఒంగోలు డీఎస్పీ శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కనకదుర్గారావు, దర్శకుడు రాజానాయుడు బత్తుల, కో-డైరెక్టర్ ప్రహ్లాద్ పాల్గొన్నారు. డీఎస్పీ శ్రీధర్‌కు చిత్ర బృందం అభినందనలు తెలిపింది.

Post midle

ఈ కార్యక్రమంలో సినీ రంగానికి చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.