రామాయణం, మహాభారతాల వైభవాన్ని తెరపై ఆవిష్కరించడమే నా లక్ష్యం: రాజమౌళి
“నా కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ‘వారణాసి’” అని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలిపారు.
చాలా కాలంగా అడ్వెంచర్ సినిమా తీయాలని అనుకుంటున్నానని, ఆ అవకాశం ఇప్పుడు #Varanasi ద్వారా లభించిందని చెప్పారు. రామాయణం, మహాభారతాలు తన సినిమాలకు ప్రధాన స్ఫూర్తి అని వెల్లడించారు.
‘వారణాసి’లో రామాయణానికి సంబంధించిన ఓ ఘట్టం ఉంటుందని, అయితే అది సినిమాలో చిన్న భాగం మాత్రమేనని పేర్కొన్నారు. భారతీయ ఇతిహాసాల గొప్పదనాన్ని, వైభవాన్ని ఇప్పటివరకు తెరపై ఆవిష్కరించిన స్థాయికంటే మరింత భారీగా చూపించాల్సిన అవసరం ఉందన్నారు.

కేవలం విజువల్ వైభవమే కాకుండా, ఇతిహాసాల్లోని పాత్రల అసాధారణ భావోద్వేగాలను కూడా తెరపై ఆవిష్కరించడమే తన ముందున్న అసలైన సవాలని రాజమౌళి పేర్కొన్నారు.
— Empire Podcastలో ఎస్.ఎస్. రాజమౌళి వ్యాఖ్యలు

#SSRajamouli #Varanasi #IndianCinema #TheSouth9



Comments are closed.