The South9
The news is by your side.

ఘనంగా ద సౌత్ 9 ఎడిటర్ మనపాటి చక్రవర్తి జన్మదిన వేడుకలు

post top

ఘనంగా ద సౌత్ 9 ఎడిటర్ మనపాటి చక్రవర్తి జన్మదిన వేడుకలు

 

నెల్లూరు, అక్టోబర్ 24: ద సౌత్ 9 ఎడిటర్, వినోద్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మనపాటి చక్రవర్తి జన్మదిన వేడుకలు నెల్లూరులోని ద సౌత్ 9 కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గాదంశెట్టి శేఖర్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

 

ఈ వేడుకలకు 22వ డివిజన్ తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ బొల్లినేని శ్రీహరి, నెల్లూరు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, స్థానిక సీపీఎం నాయకుడు జలాని, కుమార్, చిన్న దాము, ద సౌత్ 9 ఫోటోగ్రాఫర్ జగదీష్ రాజా, నెల్లూరు అనిల్ తదితరులు హాజరయ్యారు.

after image

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, మిత్రులు మనపాటి చక్రవర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, సమాజ సేవతో పాటు మీడియా రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

 

మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో కొనసాగాయి. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మనపాటి చక్రవర్తి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.