ఒకే ఫ్రేమ్‌లో రజనీ, విజయ్, కమల్.. వైరల్ అవుతున్న అరుదైన ఫొటో!
south9 chennai :
తమిళ సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు దిగ్గజాలు సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. అనిరుధ్–కావ్య మారన్ వివాహ రిసెప్షన్లో ఈ ముగ్గురు కలిసి కనిపించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫొటోలో రజనీకాంత్.. విజయ్, కమల్ హాసన్ ఇద్దరి భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా నిల్చున్నారు. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్ హీరోలు కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ అరుదైన కలయిక ఫొటోను అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినీ రంగంలో తమదైన ప్రత్యేక గుర్తింపు, భారీ అభిమానగ
ణం కలిగిన ముగ్గురు ప్రముఖులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ ఫొటో నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ముగ్గురు దిగ్గజాలు.. ఒకే ఫ్రేమ్.. అభిమానులకు కన్నుల పండువ! ❤️🔥
#Rajinikanth #ThalapathyVijay #KamalHaasan #Anirudh #KavyaMaran #TheSouth9


