The South9
The news is by your side.

ద నెక్స్ట్ ఐకాన్ 2027 పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రముఖ నటి ఎస్తేర్

post top

ద నెక్స్ట్ ఐకాన్ 2027 పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రముఖ నటి ఎస్తేర్

హైదరాబాద్: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని, ప్రతిభావంతులైన యువతకు వినోద రంగంలో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘ద నెక్స్ట్ ఐకాన్ 2027’ పోస్టర్‌ను ప్రముఖ నటి, గాయని, దర్శకురాలు ఎస్తేర్ వాలెరీ నోరోన్హా ఆవిష్కరించారు. తెలుగు, కన్నడ, కొంకణి, హిందీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందిన ఆమె చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ద సౌత్ 9 మీడియా విభాగమైన ద సౌత్ 9 బజ్ ఆధ్వర్యంలో ‘ద నెక్స్ట్ ఐకాన్ 2027’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సినిమా, నటన, ఫ్యాషన్, మోడలింగ్, డిజిటల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ప్రతిభ కలిగిన కొత్తవారిని గుర్తించి, వారికి తగిన వేదికను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన ప్రతిభావంతులకు **‘ద నెక్స్ట్ ఐకాన్ 2027 క్యాలెండర్’, ‘ద నెక్స్ట్ ఐకాన్ 2027 మ్యాగజైన్’**లో చోటు పొందే అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి ఉన్నవారు పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

 

after image

ఈ కార్యక్రమంలో ద సౌత్ 9 మీడియా ఎండీ మనపాటి చక్రవర్తి, తెలంగాణ బ్యూరో హెడ్ సుధీర్ రెడ్డి, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ విహార్ తదితరులు పాల్గొన్నారు.

 

Post midle

ప్రతిభకు వేదిక.. సెలబ్రిటీలతో స్టార్‌డమ్‌కు తొలి అడుగు అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ‘ద నెక్స్ట్ ఐకాన్ 2027’ ద్వారా తమ ప్రతిభను చాటుకోవాలనుకునే యువతకు మంచి అవకాశాన్ని అందించనున్నారు.

 

రిజిస్ట్రేషన్ వివరాలు:

 

🌐 వెబ్‌సైట్: www.thesouth9events.com

📸 ఇన్‌స్టాగ్రామ్: @thenexticon2027

📘 ఫేస్‌బుక్: thenexticon2027

 

#TheNextIcon2027 #TheSouth9Buzz #TheSouth9Media #EsterValerieNoronha #TalentHunt #RegistrationsOpen #YourTalentYourMomentYourPlatform

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.