అంబికా కృష్ణకు ‘ది నెక్స్ట్ ఐకాన్ 2027’ బ్రోచర్ అందజేత
ప్రతిభావంతులకు వేదిక కల్పించడమే లక్ష్యం – మనపాటి చక్రవర్తి
విజయవాడ: ప్రముఖ వ్యాపారవేత్త, అంబికా దర్బార్ బత్తి అధినేత అంబికా కృష్ణను దక్షిణ భారత మీడియా సంస్థ ‘ద సౌత్ 9’ ఫౌండర్ మనపాటి చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ‘ద సౌత్ 9 బజ్’ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ది నెక్స్ట్ ఐకాన్ 2027 – టాలెంట్ ప్లాట్‌ఫామ్’ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను అంబికా కృష్ణకు అందజేశారు.

ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు, నిర్వహణ విధానం, ప్రతిభావంతులకు కల్పించనున్న అవకాశాల గురించి మనపాటి చక్రవర్తి వివరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన నూతన కళాకారులు, యువతకు సరైన వేదికను అందించడంతో పాటు వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ, ప్రతిభావంతులకు గుర్తింపు, అవకాశాలు కల్పించే దిశగా ‘ది నెక్స్ట్ ఐకాన్ 2027’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
అంబికా దర్బార్ బత్తి అధినేత అంబికా కృష్ణను ద సౌత్ 9 ఫౌండర్ మనపాటి చక్రవర్తి కలిసి ది నెక్స్ట్ ఐకాన్ 2027 బ్రోచర్ అందజేశారు.

Category: సినిమా / ఈవెంట్స్ / మీడియా
Tags: The Next Icon 2027, The South 9, The South 9 Buzz, Ambica Krishna, Manapati Chakravarthi


