విజయ్ దేవరకొండ శ్రీకృష్ణుడిగా.. ‘లాలో’ తెలుగు రీమేక్‌లో క్రేజీ కాంబినేషన్?
హైదరాబాద్: గుజరాతీలో సంచలన విజయం సాధించిన ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు తెలుగు రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రను రామ్ చరణ్ పోషించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ఈ పాత్ర అత్యంత విభిన్నమైనదిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్. అయితే హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ వార్త నిజమైతే విజయ్ దేవరకొండను శ్రీకృష్ణుడి పాత్రలో చూడటానికి అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది. 🔥
#VijayDeverakonda #DilRaju #LaaloRemake #Tollywood #TeluguCinema #LordKrishna #TheSouth9


