The South9
The news is by your side.

రాష్ట్రంలో ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: వైఎస్‌ జగన్‌

post top

రాష్ట్రంలో ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: వైఎస్‌ జగన్‌

amaravathi :

స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, దాడులపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు

అమరావతి: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న దాడులు, అడ్డంకులు, అక్రమ కేసులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, మూడు రోజులుగా జరిగిన పరిణామాలకు సంబంధించిన ఆధారాలను అందించినట్లు తెలిపారు.

 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేయడం, రిటర్నింగ్‌ అధికారుల వద్ద ఉన్న పత్రాలను సైతం ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని జగన్‌ ఆరోపించారు. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని, అనంతరం ఆయనపైనే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఎంపీ గురుమూర్తిపై కూడా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.

 

పులివెందులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌, బాష్పవాయు ప్రయోగం, గాలిలోకి కాల్పులు జరిపారని జగన్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పలుచోట్ల కేసులు నమోదు చేసి పార్టీ అభ్యర్థులను అరెస్టు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

after image

Post midle

ఎన్నికల నిర్వహణపై జగన్‌ డిమాండ్లు

 

అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్‌.. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

 

స్థానిక ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పారా మిలటరీ బలగాలను రప్పించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలు, బ్యాలెట్‌ బాక్సుల భద్రపరిచే ప్రదేశాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి, వాటి ఫుటేజ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల ప్రక్రియను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

 

గమనిక: దాడులు, అక్రమ కేసులకు సంబంధించిన వివరాలు వైఎస్సార్‌సీపీ చేసిన ఆరోపణల ఆధారంగా పొందుపరిచినవి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.