నారా రోహిత్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా? భువనేశ్వరికి ఏం చెప్పాడంటే….!
సౌత్ 9 ప్రతినిధి
నారా రోహిత్ తనతో పాటు ప్రతినిధి టు సినిమాలో నటించిన హీరోయిన్ సిరి లల్లా తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 13వ తేదీన హైదరాబాద్లోని నోవాటేల్లో ఈ వేడుక జరిగింది. నారా నందమూరి కుటుంబమంతా హాజరై రోహిత్ ను సిరిని ఆశీర్వదించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామమూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్. ఇతనికి ఓ అన్న కూడా ఉన్నాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. ప్రతినిధి 2 సినిమా సమయంలో సిరి తో ప్రేమలో పడటంతో ఈ విషయాన్ని తన పెద్దమ్మ నారా భువనేశ్వరికి రోహిత్ చెప్పాడు. ఆమె చంద్రబాబుకు చెప్పడం ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి భువనేశ్వరి పెళ్లికి ఒప్పించారు. డిసెంబర్ లో వీరి వివాహం జరగబోతుంది. సిరి స్వగ్రామం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాచర్ల దగ్గర ఉన్న దైదా. ప్రస్తుతం ఇది పల్నాడు జిల్లా కింద ఉంది. వీరి కుటుంబం ధైదా నుంచి రెంటచింతలకు వలస వచ్చారు సిరి తో పాటు మరో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సిరి పెద్దక్క అంగన్వాడీ సూపర్వైజర్ గా పనిచేస్తుంది. రెండో అక్క భవాని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడింది. మూడో అక్క ప్రియాంక వివాహం చేసుకొని హైదరాబాదులో స్థిరపడింది. సిరి తండ్రి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. తల్లి గృహిణి. హైదరాబాదులో విద్యను అభ్యసించిన సిరి ఆస్ట్రేలియా కు వెళ్లి అక్కడ మోడల్ గా మారింది. తన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో గుర్తింపు వచ్చింది. అక్కడే షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. హైదరాబాదు వచ్చి సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ప్రతినిధి టూ కు ఎంపికైంది. తొలి సినిమాలో సమయంలోనే తొలి హీరో తోనే ప్రేమలో పడి వివాహం చేసుకోబోతోంది. నారావారి ఇంటికి కోడలుగా వెళ్ళబోతుందంటే సాధారణ విషయం కాదని నెటిజన్లో అంటున్నారు. ఏదైనాప్పటికీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే నారా రోహిత్ ను వివాహం చేసుకోవడం సిరి అదృష్టమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Comments are closed.