*ప్రభుత్వ సంక్షేమం పేదల ఇంటి వద్దకే : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: గాలిపాళెం, నూతక్కవారికండ్రిక, పడమటికండ్రికలలో గడప గడపకు మన ప్రభుత్వం*
*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అందచేస్తున్న ప్రతి సంక్షేమ పథకం వారి ఇంటి వద్దకే చేరుతుందని, ఈ సంక్షేమ పథకాలను అందచేసేందుకు ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*
*గురువారం చేజర్ల మండలం ఏటూరు సచివాలయం పరిధిలోని గాలిపాళెం, నూతక్కవారికండ్రిక, పడమటికండ్రికలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఆయా గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.*
*అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందచేసిన సంక్షేమ లబ్ది కరపత్రాలను వారికి అందచేసి ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన సంక్షేమపథకాలను ఎమ్మెల్యే మేకపాటి వారికి వివరించారు.*
*పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి మౌళిక సదుపాయాల విషయమై విన్నవించారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టే విధంగా చూడాలని కోరడం వెంటనే అధికారులను ఆయా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నూతక్కవారికండ్రిక గ్రామంలో జగనన్న కాలనీ స్థలాలను పరిశీలించి లబ్దిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి స్వంతింటి కలను నిజం చేసేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్కరూ ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు.*
*సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో పేదల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెందుతుందన్నారు. గ్రామంలోనే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు ఉంచారని, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ అన్ని గ్రామంలో ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.*
*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు తెలుపుతున్న అభివృద్ది పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయమై దృష్టి సారించాలన్నారు. సచివాలయం పరిధిలో మంజూరయ్యే నిధులతో అభివృద్ది పనులను ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు.*
Comments are closed.