*తేదీ: 02-12-2022*
*స్థలం: తాడేపల్లి*
*ఇదేం ఖర్మరా బాబు అని జనమంతా అంటున్నారు*
*నాటి వైఎస్సార్, సీఎం జగన్ లను మించిన సంక్షేమం మీరేం చెయ్యగలరు*
*ఎన్టీఆర్ గారి శాపమే నీకు ఈ దుస్థితిని తెచ్చి పెట్టింది*
*2024 ఎన్నికల తరువాత చంద్రబాబు రాజకీయాల్లో కనిపించడు : పేర్ని నాని*
డూప్లికేట్ స్వామీజీలా చంద్రబాబు మారిపోయడని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు కర్నూల్ వెళ్లి 2024 ఎన్నికల్లో మీరు నన్ను గెలిపించికపోతే ఇదే నా చివరి ఎన్నికలని చెప్తున్నాడు. ఈ మాటలు విని రామోజీ రావు, రాధాకృష్ణ బాధపడుతుంటారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు లేచే పరిస్థితి లేదని వాపోతుంటారు. అందుకే ఇప్పుడు పోలవరంలో మీకు చివరి అవకాశం ఇస్తున్నాను ఓటు వేయడానికని ప్రజలతో అంటున్నాడు. డుప్లికెట్ స్వామీజీలా చంద్రబాబు మారిపోయాడు. మీ తంతు చూస్తుంటే ప్రజలు ఇదేం కర్మరా బాబు అని బాధపడుతున్నారు. బాదుడే బాదుడు బాగా సక్సెస్ అయ్యిది అంటున్నారు. జనం ఛీ కొడుతుంటే సక్సెస్ అయిందంటున్నారు.
*హెరిటేజ్‌లో ధరలు, రామోజీ అమ్మే ప్రియా పచ్చళ్ల రేటంతా..?*
బయట ధరలు ఎలా ఉన్నాయి. హెరిటేజ్‌లో ఎంత ఉన్నాయి?. రామోజీ అమ్మే ప్రియ ఆయిల్స్ రేట్లు ఎంత ఉన్నాయి? అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్‌లో ఏపీ వారు చాలా మందే ఉన్నారు. అక్కడి నిత్యావసర వస్తువుల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కో చంద్రబాబు. ఇతర రాష్ట్రాల్లోని రేట్లు, ఇక్కడా ఒకేలా ఎందుకు ఉన్నాయి? ప్రజలు అమాయకులని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రజలు తిరగపడి బాదేవరకు చంద్రబాబు ఇలానే మాట్లాడతారు.
*ఎన్టీఆర్ పై దాడి చేయించింది నువ్వేగా*
ఇప్పుడు కూడా పాత కాలం నాటి ఆలోచనలు చేస్తూ మళ్లీ మాడుతున్నావు. ఎన్టీఆర్ వెనుక చేరి మల్లెల బాబ్జీ అనే వ్యక్తికి డబ్బులు ఎర చూపి రామారావు చేతిమీద గాయం చేయించి హత్యాయత్నం అని డ్రామా చేయించాం. అది తెలియక రామారావు గారు నిజంగా పొడిచేసాడని అనుకున్నారు. మల్లెల బాబ్జీ మరణ వాంగ్మూలం ఇచ్చేవరకు చంద్రబాబు కుట్ర తెలియలేదు. లేకపోతే అప్పట్లోనే ఎన్టీఆర్ ని చంపేసేవారు. చంద్రబాబుకు అధికార మదమెక్కిన్నప్పుడు వెంకన్న స్వామి వెంకన్న చౌదరిగా కనిపించాడు. బాబు తన కుట్రలతో ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురి చేశాడు. 2024 తరువాత చంద్రబాబు మీద ఎన్టీ రామారావు పగ తీర్చుకోబోతున్నాడని పేర్ని నాని తెలిపారు. రామారావు కాళ్ళు పట్టుకుని లాగి పడేసి చంపేసావు అనేది ప్రజలకు తెలుసు. అందుకే ఇప్పుడు జగన్ చేతుల్లో రాజకీయంగా కుక్క చావు చస్తున్నవని 2024 తర్వాత రామారావు ఎలా మానసికంగా కృంగిపోయి చనిపోయాడో అల జగన్ చేతుల్లో కృంగిపోతావాని ప్రజలు నీకు కొట్టే దెబ్బ 2024 తర్వాత తెలుస్తుందన్నారు. ఇంకా పాతకాలం కుట్రలు , రాజకీయాలు చేసి ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేద్దాం అనుకునే ప్రతిపక్ష నాయకుడుని వద్దనుకుంటారా. నిన్ను ప్రతిపక్షంలో ఉంచడం జగన్ కు నల్లేరు మీద నడక. ఇవాళ చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు ఆపనని , వైయస్ జగన్ కంటే ఎక్కువ ఇస్తానని చెబుతున్నారంటే..ఇదే సీఎం వైయస్ జగన్ రాజకీయ సత్తా.
అప్పులు చేశామని గగ్గోలు పెట్టిన ఎల్లో బ్యాచ్ ఇప్పుడు వైయస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారట..!! అప్పుల్లో ఏపీ 8వ స్థానంలో ఉంది. చంద్రబాబు ఇది తెలుసుకోవాలి. వైయస్ఆర్, వైయస్ జగన్ మాదిరిగానే పరిపాలిస్తామని చెబుతున్నావంటే.. ఇదే నీ కర్మ అని బాబును ఉద్దేశించి పేర్ని నాని అన్నారు. 14 ఏళ్ల పాలన ఇస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు..? 2014 టీడీపీ మేనిఫెస్టో ఎక్కడుందని ప్రశ్నించారు పేర్ని నాని. 600 హామిలిచ్చిన టీడీపీ మేనిఫెస్టోను వారి అధికారిక వెబ్ సైట్లో పెట్టుకోలేని పరిస్థితి మీది అని విమర్శించారు.
*పోలవరం ఎందుకు కట్టలేదు*
పోలవరం వెళ్లి నేను నిర్మాణాన్ని చూస్తా అని అంటున్నాడు.అప్పటి టీడీపీ కడియం శాసన సభ్యులు వట్టి వీరభద్రరావు సైకిల్ తొక్కుకుని హైద్రాబాద్ వచ్చి నిన్ను పోలవరం కట్టమని అడిగితే పట్టించుకున్నవా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశావు నిర్మించచ్చుగా, నీకు అసలు పోలవరం చూసే అర్హత ఉందా అని చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు.
Comments are closed.