The South9
The news is by your side.
after image

తెలుగు దేశం పార్టీని తెలుగు భూతుల పార్టీగా మార్చిన ఘనత చంద్రబాబుదే : మంత్రి జోగి రమేష్

 

*తేదీ : 22 -11 -2022* 

*తెలుగు దేశం పార్టీని తెలుగు భూతుల పార్టీగా మార్చిన ఘనత చంద్రబాబుదే : మంత్రి జోగి రమేష్*

Post Inner vinod found

*దేశ చరిత్రలోనే ఎమ్మెల్యేలను గడప గడపకు తిప్పిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిదే*

 

అధికార దాహం తో ఉన్న చంద్రబాబు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియని పవన్ కళ్యాణ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే యనమల రామకృష్ణుడు వీళ్లంతా సైకోలని వైఎస్సార్సీపీ పార్టీ గృహ నిర్మాణాల శాఖా మంత్రి జోగి రమేష్ అన్నారు. తాడేపల్లి లో జరిగిన విలేఖర్ల సమావేశం లో మాట్లాడుతూ టీడీపీ ని తెలుగు భూతుల పార్టీ అనడాన్ని జీర్ణించుకోలేక పోతున్న తెలుగు దేశం పార్టీ నాయకులకి అది ఎందుకు తెలుగు భూతుల పార్టీనో వివరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం లో చంద్రబాబు పార్టీకి చేసిందేమిటి..నమ్మి పిల్లని ఇచ్చిన మామని వెన్నుపోటు పొడిచి పార్టీ ని తన సొంతం చేసుకుని చివరికి ఎన్టీఆర్ భవన్ ని కూడా దక్కించుక్కన్న చంద్రబాబు ఈరోజు అధికార దాహం తో చేసే వ్యాఖలు..నెలకోసారి వచ్చి ప్రజలని రెచ్చగొట్టే వ్యాఖలు చేసే పవన్ కళ్యాణ్…ముఖ్యమంత్రి అనే గౌరవము లేకుండా వ్యాఖలు చేసే యనమల రామకృష్ణున్ని సైకోలు గా అభివర్ణించారు. ఇలా సైకోలు గా ప్రవర్తించి, నిజానిజాలను నిర్ధారించుకోకుండా జత కత్తిని వీరి తెలుగు దేశం దొంగల పార్టీ అనకుంటే ఎం అంటారు అని మండిపడ్డారు

 

చెప్పులు వెయ్యడం, రాళ్లతో కొట్టించడం, బట్టలు ఉడద్దేసి కొడతా అని చంద్రబాబు నాయుడు…మనల్ని ఎవడు రా ఆపేది, రండి రా చూసుకుందాం, కాళ్ళు విరగ్గొడతా అంటూ పవన్ కళ్యాణ్…చెత్త ముఖ్యమంత్రి అంటూ యనమల రామకృష్ణుడు మాటలు వింటూ ఉంటె రాజకీయాలకోసం ఇంత దిగజారిపోయారో తెలిసిపోతుంది. 2014 లో ముగ్గురు కలిసి పోటీ చేసి, మానిఫెస్టోని తుంగలో తొక్కి మల్లి దొంగ దారిలో విడిపోయిన మీకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, మీ బట్టలు ప్రజలే ఊడదీసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి 86 నియోజకవర్గాలలో ఎవ్వరు రాలేదని ఈరోజు టీడీపీ ఒక చచ్చిపోయిన పార్టీ అని వ్యాఖ్యానించారు.

 

రాష్ట్ర ప్రజలందరికి ఎటువంటి వివక్షలు లేకుండా సంక్షేమ పధకాలు అందుతుంటే బాదుడే బాదుడు అంటూ మీరు చేస్తున్న విన్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, వాల్లే మీకు బుద్ది చెపుతారు అని ఎద్దేవా చేసారు. ఎస్సి , ఎస్టీ , బీసీ , మైనారిటీలు ఎలా అభివృద్ధి చెయ్యాలని ఆలోచన జగన్ గారిది అయితే ఎంత సేపు అబ్బదలు ఆడటం మీ పని అందుకే మీది అబద్దాల పార్టీ అని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్.

Post midle

Comments are closed.