*అమరావతి.*
క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష.
*–ఈ శాఖపరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఎం.*
*ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… :*
*ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లు:*
– ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలి: సీఎం
– ఈ లే అవుట్స్ ఆదర్శనీయంగా ఉండాలన్న సీఎం:
– లే అవుట్స్ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలన్న సీఎం
– ప్రతి ఒక్కరూడా వీటిని చూసి, ఇదే మాదిరిగా లే అవుట్స్ ఉండాలన్న రీతిలో వీటిని తీర్చిదిద్దాలి:
– న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలి:
– జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తింపు
– శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైయస్సార్, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో రెండు చోట్ల లే అవుట్స్ పనులు, 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులు.
ఈ లే అవుట్స్‌ను మే చివరినాటికి సిద్ధం చేస్తున్నామన్న అధికారులు:
*క్లీన్ ఆంధ్రప్రదేశ్ :*
– తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అన్నదానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి:
– ఏ కలర్ డబ్బాలో ఏ చెత్త వేయాలి అన్నదానిపై కరపత్రాలను ప్రతి ఇంటికీ ఇవ్వాలి:
– ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామన్న అధికారులు
– 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికి పంపిణీ చేస్తామన్న అధికారులు.
– 2426 ఆటోలు ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి:
మిగిలినవి ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్న అధికారులు
– 1123 ఇ–ఆటోలు కూడా జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి
– గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ
*ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు:*
– ప్రతిరోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి:
– దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి:
– ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలి:
– దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది:
– దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు, వస్తున్నాయి, పోతున్నాయి. కాని అసలు సమస్య ఏంటంటే..?
ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటనేవి తెలుస్తాయి, కాని వాటి పరిష్కారంలోనే నిర్లక్ష్యం కనిపిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులు వాటి పరిష్కారంలో అంకిత భావం చూపకపోతే.. అవి అలానే ఉండిపోతాయి:
*టిడ్కో ఇళ్లపై సమీక్ష:*
– రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్ చేశారు:
– మన ప్రభుత్వం వచ్చాక వాటిపై దృష్టి పెట్టింది:
– పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటికోసం వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది:
– ఇవి లేకపోతే మళ్లీ మురికివాడలు మాదిరిగా తయారయ్యేవి:
– మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా మనం అడుగులు ముందుకేస్తున్నాం:
– టిడ్కో ఇళ్లను ఆ మేరకు తీర్చిదిద్దాం:
– టిడ్కో ఇళ్ల మీద సుమారుగా రూ.5500 కోట్లు ఈమూడేళ్లలో ఖర్చుచేశాం:
– రానున్న రోజుల్లో మరింత ఖర్చు చేస్తాం :
*రోడ్లపై దృష్టి:*
– కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్లపై దృష్టిపెట్టండి:
– ఎక్కడైనా గుంతలులేని రోడ్లు కనిపించాలి:
– నాడు – నేడు కింద బాగు చేసిన రోడ్లను చూపించాలి:
– జూన్‌నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామన్న అధికారులు
*అమరావతి ప్రాంతంలో పనులపై సీఎం సమీక్ష:*
– కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయన్న అధికారులు
– ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించామని తెలిపిన అధికారులు.
– దీంతో పనులు వేగవంతం అవుతున్నాయన్న అధికారులు
– సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టిపెట్టామన్న అధికారులు.
– ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించిన అధికారులు.
*విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష:*
– వనరుల సమీకరణపై చర్చ.
– సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రతిపాదనలు:
– మెట్రోరైల్ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం.
– ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలని సీఎం ఆదేశం.
– పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలన్న సీఎం.
*జగనన్న మహిళా మార్ట్‌లపై సీఎం సమీక్ష:*
– మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్‌లు.
– ప్రస్తుతం నడుస్తున్న మహిళా మార్ట్‌లను వివరించిన అధికారులు.
– విజయవంతంగా నడుస్తున్నాయన్న అధికారులు.
– వీలైనన్ని మహిళా మార్ట్‌లను నెలకొల్పాన్న సీఎం.
– దీనికోసం ప్రభుత్వం నుంచి తగినంత సహాయ సహకారాలు అందించాలన్న సీఎం.
– మహిళా మార్ట్‌లకోసం వివిధ ప్రాంతాల్లో మంచి భవనాలను గుర్తించాలన్న సీఎం.
ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్‌శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి వి రామ మనోహరరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments are closed.