- నా పేరు ముందు నేచురల్ స్టార్ ని తీసేస్తా
- థియేటర్ కలెక్షన్ ల కన్నా పక్కన బట్టి కొట్టు వాడి కలెక్షన్ ఎక్కువ
- ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుంది
- ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాని! ఆంధ్ర లో టికెట్ల రేట్లు పెంపుదలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సినిమా ఇండస్ట్రీలోని హీరోలు చిన్నగా తమ అసంతృప్తిని బయటపెడుతుఉన్నారు. తాజాగా శ్యామ్ సింగరాయ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరో నాని మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంపై తన స్పందనను తెలియజేశారు. రాజకీయాలు సినిమా విషయాలు పక్కన పెడితే , ఈనిర్ణయం వల్ల ప్రేక్షకుల్ని కించపరచడం అనే అన్నారు. పదిమందికి ఉపాధి కల్పించి థియేటర్లు కలెక్షన్లు కన్నా, పక్కన ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. రేపు చిత్రం విడుదల సందర్భంగా ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుందని అంటూనే, తన భావన ని తెలియ పరిచాడు నాని.
Prev Post
Comments are closed.