హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ తెచ్చే అంశాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంజయ్ భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్. అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అంబేద్కర్ ప్రవచించిన పలు అంశాలను బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోన కేసులు పెరగడానికి నిజాముద్దిన్ మర్కజ్ మసీదు ప్రార్ధనలు వెళ్లి వచ్చిన వారే కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రేషన్ అందరికి అందడం లేదని దీనికి కేసీఆర్ ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పాలని చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
Comments are closed.