చెన్నై ప్రతినిధి : దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ న్యూస్ అంటే తన అభిమానులక అదొక పండగలాంటి వార్త. గత నెల19న వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా కి వెళ్ళిన రజినీకాంత్ 9న చెన్నై చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రజినీ తన అభిమాన సంఘ నాయకులతో సమావేశం నిర్వహించాలని ఆయన అభిమాన సంఘ నాయకులకు వర్తమానం పంపారు. అయితే అభిమాన సంఘ నాయకుల నుంచి అంత స్పందన రాలేదని సమాచారం. గతంలో రజినీ తన అభిమానులతో మీటింగ్ అంటే హడావుడి మామూలుగా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే రజినీ రాజకీయాలకు దూరం అనే స్పష్టత ఇచ్చారో అప్పుడు నుంచి అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు అనేది నిజం. ఈ నేపథ్యంలో రజినీ సమావేశం అనగానే జిల్లా అధ్యక్షులు నుంచి స్పందన రాకపోగా తాము రామని ఖరాఖండిగా చెప్పారని తెలుస్తుంది. కొంతమంది మాత్రం తూతూమంత్రంగా సమావేశాన్ని నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సమావేశ ఉద్దేశం మాత్రం తెలియరాలేదు.
Comments are closed.