చెన్నై ప్రతినిధి : ప్రముఖ దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ కి లైకా ప్రొడక్షన్స్ కి మధ్య జరుగుతున్న వివాదం క్లైమాక్స్ కు చేరింది. గతంలో లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ,అమీ జాక్సన్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో రూపొందించిన చిత్రం “రోబో 2″ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత అదే సంస్థ తో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు-2 చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించగానే , లైకా ప్రొడక్షన్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. భారతీయుడు _2 సినిమా పూర్తి కాకుండా వేరే చిత్రానికి శంకర్ దర్శకత్వం. వహించారాదని ఈ పిటిషన్ లో పేర్కొంది లైకా ప్రొడక్షన్ సంస్థ. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు దర్శకుడు శంకర్ కి అనుకూలమైన తీర్పుని వెలువరించింది. పిటిషన్ ని హైకోర్టు కొట్టివేడంతో, రామ్ చరణ్ , సినిమాకి అడ్డంకులు తొలగిపోయాయి . గతంలో ఎప్పుడూ లేని విధంగా చిన్న చిన్న విషయాలకు కోర్టును ఆశ్రయించడం కొత్తగా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Comments are closed.