దశ చిత్రాలతో తెలుగు చలనచిత్ర రంగం దిశను ప్రపంచ స్థాయికి చేర్చిన మేరునగధీరుడు , దర్శక ధీరుడు… రాజమౌళి జన్మదిన సందర్భంగా
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని,తను దర్శకత్వం వహించిన ప్రతి చిత్రాన్ని తన దర్శకత్వ ప్రతిభ తో విజయతీరాలుకు చేర్చిన దర్శకుడు రాజమౌళి. సామాన్య కధ ను అనితర సాధ్యం గా తీయడంలో తనకు తానే సాటి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. స్టూడెంట్ నెంబర్1 నుంచి బాహుబలి దాకా ఒక అపజయం ఎరగని దర్శకుడు గా రాజమౌళి స్థానం సుస్థిరమయిన ది అని చెప్పాలి.తను దర్సకత్వం వహించిన ప్రతి చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా
తీయడం రాజమౌళి కె చెల్లింది. ప్రతి అగ్ర హీరో తను దర్సకత్వంలో నటించాలని ఎదురు చూస్తున్నారు అంటే కధ, కధనాలు మీద తన పట్టు ఏపాటిదో ఇట్టే తెలుసుకోవచ్చు.
యాక్షన్, సెంటిమెంట్, హీరోని ఎలివేట్ చేయడం లో రాజమౌళి ప్రత్యేక త ప్రతి సినీ ప్రేక్షకుడికి తెలుసు, ఒక సింహాద్రి, ఒక ఛత్రపతి,ఒక విక్రమార్కుడు, ఒకమగధీర,ఇలా హీరో లను వేరే స్థాయిలో చూపించడం రాజమౌళి కే సాధ్యం. హీరో నే లేకుండా ఈగ తో కూడా ఇండస్ట్రీరికార్డ్స్ ని క్రియేట్ చేయగల ఈ క్రియేటివ్ జీనియస్ రాజమౌళి. తెలుగు చిత్ర ఖ్యాతి ని అంతర్జాతీయ స్థాయిలో నిలిబెట్టిన ఘనత’ బాహుబలి ‘రాజమౌళి, ది. ఒక తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీసి చూపిండం దానికి అఖండ విజయం అందించడం తో రాజమాళి విజన్ ఏ పాటిదో తెలుస్తోంది. ఇప్పుడు ఇద్దరు అగ్ర హీరోల తో R R R అనే భారీ చిత్రానికి శ్రీకారం చుట్టి అగ్ర దర్శకుల పరుగు పందెం అనే పోటీ లో ఎవరికి కనిపించని, అందని, అందుకోని దూరం లో ఉన్న దర్సక ధీరుడు…… రాజమౌళి….. కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ……
ద సౌత్9……మహి.
Comments are closed.