ఆ ప్రాంతం అంతా ‘ద్వీపాల వనం’ అని చెప్పుకోవచ్చు. ఒకటి కాదు..రెండు కాదు..ఎన్నో ద్వీపాలు. పుకెట్ లో అన్నింటి కంటే హైలెట్ అంటే పీ పీ ద్వీపం అని చెప్పుకోవచ్చు. థాయ్ ల్యాండ్ లోని పుకెట్ కు వెళ్ళారంటే ఖచ్చితంగా చూసి తీరాల్సిన ద్వీపాల్లో పీ పీ ఐల్యాండ్ ఒకటి. పర్యాటకులు పుకెట్ లో ఏ హోటల్ లో బస చేసినా అక్కడ నుంచే పీపీ ఐల్యాండ్ తోపాటు పలు ద్వీపాలకు టూర్లు ఏర్పాటు చేస్తారు. ఉదయం పుకెట్ నుంచి బయలుదేరి..సాయంత్రానికి అన్ని ద్వీపాలను చూసిన తర్వాత నిర్వాహకులు వెనక్కి తీసుకువస్తారు. పీ పీ ఐల్యాండ్ తో కూడిన ద్వీపాల సందర్శనకు స్పీడ్ బోట్ పై అయితే పెద్దలకు 2800 బాత్ లు, పిల్లలకు (మూడు నుంచి పది సంవత్సరాల లోపు) అయితే 1600 బాత్ లు వసూలు చేస్తారు. భారతీయ కరెన్సీ 2.27 రూపాయలకు ఒక థాయ్ ల్యాండ్ బాత్.

Comments are closed.