కృష్ణా: కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీని 5 గంటల లోనే నందిగామ పోలీసులు ఛేదించారు.
నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి అక్షర ను చందు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఆధారంగా చందు కదలికలు పసిగట్టి పట్టుకున్నారు.చిన్నారి అక్షర తండ్రి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తల్లి ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
అక్షర తండ్రితో స్నేహంగా ఉంటున్న చందు ని కిడ్నాపర్ గా పోలీసులు గుర్తించారు. విజయవాడలో చందు ని అదుపులోకి తీసుకొని అక్షరను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. నందిగామ సిఐ కనకారావు ఎస్ఐ ఏసోబును స్థానికులు అభినందించారు.
Comments are closed.