యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు మార్గం సుగమం.. లోక్‌సభలో బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ: యూపీఐ (UPI) ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులపై భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశాలకు మార్గం సుగమమైంది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్–2007 సవరణ బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. ఈ సవరణతో అవసరమైతే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు (ఎండీఆర్) వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి చట్టబద్ధమైన అధికారం లభించనుంది. బిల్లు సభలో పెద్దగా చర్చ లేకుండానే ఆమోదం పొందింది.
అయితే, ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు అమల్లోకి రాలేదు. ఛార్జీల విధానం, ఎవరికి వర్తిస్తాయి, ఎప్పటి నుంచి అమలు చేస్తారనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం తర్వాత ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోనుంది



Comments are closed.