The South9
The news is by your side.

మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మనపాటి చక్రవర్తి

post top

నెల్లూరు :

మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మనపాటి చక్రవర్తి

 

నెల్లూరు: మాజీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ద సౌత్ 9 మీడియా, వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ మనపాటి చక్రవర్తి మంగళవారం నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

after image

ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డితో మనపాటి చక్రవర్తి కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. మీడియా రంగంలో తన ప్రయాణంతో పాటు వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.

 

ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సేవా రంగంలో అవార్డు అందుకున్న మనపాటి చక్రవర్తిని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభినందించారు. సమాజ సేవలో మరింతగా ముందుకు సాగాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక అంశాలు, మీడియా రంగంలో వస్తున్న మార్పులు తదితర అంశాలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగింది.

 

Post midle

ఈ మర్యాదపూర్వక భేటీలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మస్తాన్‌రెడ్డి, స్పందన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

కాగా, నెల్లూరులో పర్యటన ముగించుకున్న అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.