నెల్లూరు: జర్నలిస్టులకు వాసన్ ఐ కేర్ ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ
నెల్లూరు నగరంలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్‌లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (APJU) ఆధ్వర్యంలో, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టులకు ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో APJU రాష్ట్ర జనరల్ సెక్రటరీ గాదంశెట్టి శేఖర్ బాబు, APJU రాష్ట్ర సెక్రటరీ, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనపాటి చక్రవర్తి పాల్గొని జర్నలిస్టులకు హెల్త్ కార్డులను అందజేశారు.


వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ విశ్వ శరణ్ రెడ్డి, సెంట్రల్ హెడ్ వెంకటరమణ, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ కృష్ణ నరేష్ తదితరులు పాల్గొన్నారు.


