The South9
The news is by your side.
after image

చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గం :టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్.

post top

ఐపీఎస్ అధికారులు కొందరు జగన్ ను కలవడం వెనుక కుట్ర దాగి ఉంది?

చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గం ..

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ ..‌‌.

Post Inner vinod found

విజయవాడ ఆగస్ట్ 23

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారులు కొందరు బెంగళూరు ప్యాలెస్ లో జగన్ ను కలవడం వెనక కుట్ర దాగి ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ ఆరోపించారు శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు సివిల్ సర్వీస్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు బెంగళూరు ప్యాలెస్ కి వెళ్లి జగన్ ను కలిసి డ్రామాలాడుతున్నారని జగన్ ను కలిసి జరిపిన మంతనాలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు

కొందరు ఐపీఎస్ అధికారులు ప్రత్యేకంగా జగన్ ను కలవడంపై డిజిపి విచారణ జరిపి వారిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కొందరు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను అణిచివేసేది జగనేనని ఆయన ఆరోపించారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టడంతో జగన్ భక్తులు గా ఉన్న కొందరు ఐపిఎస్ అధికారులు

ప్రభుత్వం వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలుసుకొని భయ పడుతున్నారని అందుకే ఐపీఎస్ అధికారులు కొందరు జగన్ ను కలిసి ఏమి చర్చించారరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు పోలీస్ ఐపీఎస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జగన్కు తొత్తులుగా వ్యవహరించి జగన్ కు నచ్చిన విధంగా తెలుగుదేశం విపక్ష నేతలపై గురిపెట్టి అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించిన ఐపీఎస్ అధికారులకు నేడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే వారికి ప్రభుత్వాని చూసి అధికారులు భయపడుతున్నారని ఆయన తెలిపారు , జగన్ సీఎం కాగానే రాష్ట్రానికి కొందరు ఐపీఎస్ అధికారులను తప్పించుకున్నారని ముఖ్యమంత్రి జగన్ కు నచ్చని తెలుగుదేశం నాయకుల జాబితాను తయారుచేసి ఐపీఎస్ అధికారులతో వేట ప్రారంభించారని ఆయన విమర్శించారు,తొలిత మాజీ స్పీకర్ మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పై గురి పెట్టారుని ఆయన కుటుంబాన్ని వ్యాపార పరంగా ఇబ్బందులు పెట్టారని ఆర్థిక ఇబ్బందులు గురిచేసి కోడెలను మానసికంగా వేదించారని అసెంబ్లీలో పర్నీచర్లను స్పీకర్ కోడెల శివప్రసాదరావు దొంగలించారన్న దారుణమైన కేసు పెట్టి ఆయనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆయన తెలిపారు అనంతపురంలో జేసీ బ్రదర్స్ పై రవాణా శాఖ కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు వేధించారని అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు వైసీపీలో చేరకుండా టిడిపిలో చేరినందుకు జెసి బ్రదర్స్ పై కక్ష సాధింపులు మొదలుపెట్టారని ఆయన విమర్శించారు ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనాలకు సంబంధించి జెసి ప్రభాకర్ రెడ్డి ఆయనకు కుమారుడు అశ్వింత రెడ్డి లపై పోలీసులతో కేసులు పెట్టారని వారిని అరెస్టు చేయించి జైలు కూడా పంపి జగన్ మెప్పు పొందారని ఆయన విమర్శించారు అందుకు బహుమతి గా ఏసీబీ చీఫ్ ఏపీపీఎస్ కార్యదర్శి పదవులు పొందారనిఆయన తెలిపారు ఏపీపీఎస్ కార్యదర్శి కమిషనర్ చైర్మన్ పిన్నమనేని ఉదయ భాస్కర్ ను టార్గెట్ చేశారని ఆయన చేత రాజీనామా చేయించడంమై ఆయన కార్యాలయానికి రాకుండా గదిలో తాళం వేస్తారని ఆయన తెలిపారు కనీసం అటెండర్లు కూడా అందుబాటులో లేకుండా చేశారని చైర్మన్ సంతకం లేకుండా ఏపీపీఎస్సీ నిర్ణయాలకు విడుదల చేశారని ఆయన ఆరోపించారు ఏసీబీ అధిపతిగా విపక్ష నేతలే లక్ష్యంగా పీ ఎస్ ఆర్ ఆంజనేయులు పావులు కదిపారని ఆయన విమర్శించారు జగన్ విపక్షంలో ఉండగా ఆయన్ని గట్టిగా నిలదీసిన నిలువరించిన తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి కే అచ్చెన్నాయుడు ని ఈఎస్ఐ మందుల కేసులు ఇరికించారని అనారోగ్యానికి గురై ఆపరేషన్ చేయించుకున్న అచ్చె నాయుడును ఎక్కువ జామున పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారని రాష్ట్రానికి చివర నుండి శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నుండి విజయవాడ కు వాహనంలో అచ్చెన్నాయుడు ను తీసుకువచ్చి విజయవాడలో ఆయన పరీక్షలు చేయించి, తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని అచ్చెనాయుడు ను పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు గురి చేశారని ఆయన తెలిపారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై హత్య కేసు తప్పుడు కేసును పెట్టించి జైలుకు పంపారని ఆయన విమర్శించారు పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి జైలు పంపారని ఆయన విమర్శించారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు జగన్ ప్రభుత్వం ఏదో సాకు చూపించు ఐదేళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని సివిల్ అధికారుల సర్వీస్ రిజిస్టర్ను జగన్ దగ్గర పెట్టుకుని వేధించాడని ఆయన విమర్శించారు. ఇక సిల్క్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును చేయని తప్పుకు దొంగ పత్రాలు సృష్టించి అన్యాయంగా అరెస్టు చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లోకు పంపారని ఆయన విమర్శించారు కర్నూలు జిల్లా నంద్యాలలో చంద్రబాబును అర్ధరాత్రి ఎన్నో ఇబ్బందులు గురిచేసి అరెస్టు చేసి 450 కిలోమీటర్లు కారులో తీసుకురావడం దుర్మార్గమని ఆయన విమర్శించారు సిఐడి ఐజి కొల్లి రఘురామిరెడ్డి మొత్తం స్క్రీన్పై దర్శకత్వం జగన్ దే అని ఆయన ఆరోపించారు జగనే చంద్రబాబును ఎలా అరెస్ట్ చేయాలి ? అనే దానిపై జగన్ సిఐడి అధికారులకు ఆదేశాలిచ్చి జగన్ లండన్ కు చెక్కేసారని ఆయన విమర్శించారు సిఐడి అదనపు డీజీ సంజయ్ సెలవులో ఉండగా పిఎస్సార్ ఆంజనేయులు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారని ఆ సమయంలోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో లేనిపోని అబద్దాలను గాలిని పోగు చేసి చంద్రబాబు చేయని నేరానికి అన్యాయంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు చంద్రబాబు ను అరెస్టు చేసిన తర్వాత సిఐడి చీప్ సంజయ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు హైదరాబాద్ ఢిల్లీ నగరాల్లో చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రెస్మీట్లో పెట్టారని ఆయన విమర్శించారు సంజయ్ పొన్నువోలుసుధాకర్ రెడ్డి లు ప్రెస్ మీట్ లు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రెస్మీట్లో పెట్టే అవకాశం లేదని అయినప్పటికీ సంజయ్ పొన్నవోలు సుధాకర్ బరితెగించి చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేసి విష ప్రచారాన్ని చేశారని చంద్రబాబును జగన్ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపిందని దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలంతా చంద్రబాబుకు అండగా నిలిచి నిరసన ప్రదర్శనలు చేసి జగన్ పై విరుచుకుపడ్డారని ఆయన తెలిపారు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా చంద్రబాబుకు తెలుగు ప్రజలంతా అండగా నిలిచారని దాంతో జగన్ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో కుప్పకూలిపోయిందని ఆయన తెలిపారు చంద్రబాబును అన్యాయంగా జగన్ అరెస్ట్ చేయించాడని ఇతర దేశాల్లో అమెరికా లండన్ కెనడా ప్రపంచ దేశాల్లో చంద్రబాబుకు ప్రజలంతా మద్దతుగా నిలిచారని ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేసి చంద్రబాబుకు అండగా నిలిచారని ఆయన తెలిపారు దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలంతా కూడా జగన్ ప్రభుత్వాం పై విరుచుకుపడ్డారని అందుకే 2024 ఎన్నికల్లో జగన్కు ప్రజలంతా చుక్కలు చూపించి పదకొండు సీట్లకు జగన్ పరిమితంగా చేశారని ఆయన తెలిపారు రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారని ఏకంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కుమారుల పైనే కేసు పెట్టి వేధించారని ఆయన విమర్శించారు వైసీపీ నేతలకు కొమ్ము కాయడం తెలుగుదేశం విపక్ష నాయకులను వేధించుటమే ఐదేళ్లుగా ఐపీఎస్ అధికారులు పనిచేశారని ఆయన ఆరోపించారు విజయవాడలో జగన్ పై గులకరాయి దాడి కేసులో వెనకబడిన వర్గాలకు చెందిన అమాయక బాలుడును వేదించారని ఆ బాలుడు పై కేసు పెట్టి జైలుకు పంపారని ఆయన విమర్శించారు గతంలో అనంతపురం రేంజ్ డీఐజీగా ఉంటూ చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అక్రమాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అనంతపురం నుంచి దొంగ ఓటర్లను తీసుకొని వాహనాలకు రైట్ చెప్పింది ఐపీఎస్ ఆఫీసర్ క్రాంతి రాణా అని పాతర్ల ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సందర్భంగా కుప్పంలో వైసిపి చేసిన అరాచకాలుకు ఆయన అప్పుడు ఎస్పీ మద్దతు ఉందని తమిళనాడు నుంచి రప్పించిన దొంగ ఓటర్లను స్థానికుల పేర్లతో ఉన్న ఓట్లు వేయించిన పోలీస్ లు అడ్డుకోలేదని, వై వి సుబ్బారెడ్డి ఆశీర్వాదంతోనే క్రాంతి రాణా విజయవాడ కమిషనర్ గా పోస్టింగ్ తెచ్చుకున్నాడని ఆయన ఆరోపించారు గుంటూరు రేంజి ఐజి బాలరాజు తన పరిధిలో పోలీసు అధికారులతో సమర్థవంతంగా పనిచేయించడంలో ఫెయిలయ్యారని, పల్నాడు జిల్లాలో అరాచకాలు సృష్టిస్తున్నారని. నెల్లూరులో ఏకపక్ష పోలీస్ సింగ్ ఏ మాత్రం పట్టించుకోని ఆయన ప్రధాని ప్రధాని మోడీ సభకు భద్రత ఏర్పాట్లు పరిరక్షించడంలో విప్లమయ్యారని ఆయన విమర్శించారు

Post midle

Comments are closed.