తేదీ: 21-02-2022,
హైదరాబాద్.
మంత్రి మేకపాటి అకాల మరణంతో దు:ఖసాగరంలో తెలుగు రాష్ట్రాలు
*అనతికాలంలోనే రాజకీయాలలో ఆదర్శవంతమైన వ్యక్తిగా తనదైన ముద్ర*
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నచ్చిన వ్యక్తిగా, మెచ్చిన మంత్రిగా పేరు*
*కుల,మత,ప్రాంత, వర్గాలకు అతీతంగా కనబడిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్తవం*
*అడిగిన వారందరికీ చేతనైన సాయం చేసే అరుదైన వ్యక్తిత్వం*
*వివాదరహితుడిగా, విమర్శలకు దూరంగా అజాత శత్రువుగా మంత్రి మేకపాటికి తుదిశ్వాసవరకూ ప్రత్యేక శైలి*
*కారు డ్రైవర్ నుంచి, బ్యూరో క్రాట్ దాకా అందరినీ ఒకేలా గౌరవించే విశిష్ట లక్షణం*
*తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు, ముఖ్యమంత్రి పట్ల అపారమైన ప్రేమ*
*ముఖ్యమంత్రి మనసులోతుల్లోని ఆలోచనను కర్తవ్యంగా భావించి ఆయన అనుకున్నది అనుకున్నట్లు చేసే హితుడు, స్నేహితుడు*
*అత్యంత ఆరోగ్యంగా కనిపించే ఆరడుగుల ఆజానుబావుడు గుండెపోటుతో మరణించడంపట్ల గుండెలు పగిలేలా విలపిస్తున్న ప్రజలు, అభిమానులు*
*అందరి ఆప్తుడు, ప్రతి ఒక్కరి ప్రేమికుడు, నమ్ముకున్నవారికి ఆపద్బాంధవుడు*
*”ఏమోయ్!” అంటూ తన సిబ్బందిని పిలిచే మనిషి ఇక లేడన్న సంగతిని జీర్ణించుకోలేకపోతున్న మంత్రి మేకపాటి పేషీ*
*ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు రాకున్నా పరవాలేదు…చెడ్డపేరు మాత్రం రాకూడదని పదే పదే తపించిన మంత్రి గౌతమ్*
*ఇలాంటి మంత్రిని ముందెన్నడూ చూడలేదు, ఇకపైన చూడబోమనేలా చివరి శ్వాసవరకూ బతికిన మంత్రి మేకపాటి*
*ఎక్కడా అవినీతి మరకలేదు, ఏ చిన్న విమర్శా లేదు, పని చేయడంలో రాజీ లేదు, అనుకున్న లక్ష్యం చేరేవరకూ విశ్రమించే వారు కాదు*
*సూటు, బూటుతో తెలుగు రాజకీయాలలో నీటు పాలిటిక్స్ ను చూపించిన మంత్రి మేకపాటి.
Comments are closed.