The South9
The news is by your side.
after image

‘మా ‘ఎన్నికలు కోర్టు మెట్లు ఎక్కనున్నాయా?

గత కొన్ని రోజులుగా , సాధారణ ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కనున్నాయి అనే వార్తలు ఫిలింనగర్ లో షికారు చేస్తున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ లు పోటాపోటీగా ప్రచారం చేసుకున్న తర్వాత మంచు విష్ణు ప్యానల్ ఘనవిజయం సాధించింది. ఇక్కడితో వ్యవహారం ఆగిపోతుంది అనుకుంటే ముందు ప్రకాష్ రాజ్, నాగబాబు లు రాజీనామా చేసి, తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్లో గెలిచిన వారందరి చేత రాజీనామా చేయించడంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఎవరు గెలిచినా అక్కడి తో ఆపితే బాగుండేది కానీ దానిని ఇంకా ముందుకు తీసుకెళ్లడం చాలామంది లోలోన అసంతృప్తిగా ఉన్నారని, మన వ్యవహారాన్ని మనమే బయట పెట్టుకుంటున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎన్నికల రోజు జరిగిన వీడియో పుటేజ్ కావాలని అని ఎన్నికల అధికారికి లేఖ రాయడం తో ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ల నుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ పుటేజ్ కోర్టుకు చూపించి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని తెలియజేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది.

Post Inner vinod found

 

అలానే ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి ని ప్రకాష్ రాజ్ సంప్రదించినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం? నిరంజన్ రెడ్డి ఆచార్య చిత్ర నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. సినీ రంగంలోని ప్రముఖులకు ఆయన న్యాయవాది గా ఉంటూ, ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా వారే పర్యవేక్షించడం విశేషం. ఈ విషయం తేలాలంటే సోమవారం దాకా ఆగాల్సిందే!

Post midle

Comments are closed.