అమరావతి: వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న అంశంపై పార్టీలోని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపడతానని చెప్పిన మాట ప్రకారం విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే కొత్తగా మంత్రులు అవ్వాలని చాలామంది ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేల పనితీరుపై నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్నారని , దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అయితే అమరావతి వర్గాల్లో ఒక చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక నేతకి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నాయకులు చర్చించుకుని నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఎక్కడ ఎమ్మెల్యేగా గెలవకపోయినా…. ఆయన మంత్రివర్గంలో కి తీసుకోవాలనే దానిపై అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు వైసిపి నాయకులు మాట్లాడుకోవడం విశేషం. ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో అనేది మాత్రం మరికొన్ని రోజుల్లో తేలనుంది.
Comments are closed.