అమరావతి : ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎలా అయినా అమలు పరుస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక్కోసారి తను నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పనికి సంబంధించి ఎంత పెద్ద సమస్య ఉన్న దానిని పూర్తి చేయాలనే చిత్తశుద్ది కలిగిన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో పేద ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకు వస్తాను అన్న నాయకుల హామీలను, టీవీల్లో పేపర్లలో చూశాం, చదివాం, కానీ అవన్నీ కార్య రూపం దాల్చవని, మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి, కార్యక్రమాలు చేపట్టిన అగ్రతాంబూలం మాత్రం నాడు_ నేడు కార్యక్రమం అని చెప్పవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్ విద్యా వ్యవస్థ ని సమూలంగా మారుస్తానని చెప్పినప్పుడు చాలామంది పెదవి విరిచారు. అన్ని రాజకీయ పక్షాలు కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా ఉంటాయని అపవాదును చెరిపేస్తూ ప్రభుత్వ పాఠశాలను, కార్పొరేట్ పాఠశాలలు గా మార్చేశారు వైఎస్ జగన్. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు వెళ్లి పాఠశాలలు గా చూసే ప్రజలు, నేడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా చేసిన అభివృద్ధి తో ప్రభుత్వ పాఠశాలలు , కార్పొరేట్ పాఠశాలలకి ఏ మాత్రం తగ్గకుండా మారాయి. వీటి సీట్ల కోసం జనం ఎగబడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా విజయనగరంలోని కొత్తపేట కె.వి గొల్ల పాఠశాలలో సీట్లు లేవు అనే బోర్డు దర్శనమిచ్చింది. అలానే నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామీణ లోని కె .ఎన్ .ఆర్. హై స్కూల్ లో కూడా ఇట్లు లేవనే బోర్డు దర్శనమిచ్చింది జగన్మోహన్ రెడ్డి ఈ ఇరవై ఏడు నెలల పాలనలో నాడు నేడు మాత్రం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.
Comments are closed.