అమరావతి :త్వరలో టాలీవుడ్ సినీ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అపాయింట్మెంట్ దొరికినట్లు తెలుస్తుంది. గత కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, శ్యాంమ్ ప్రసాద్ రెడ్డి, తదితరులు కలిసి సినీ పరిశ్రమకు చెందిన పలు సమస్యల పై చర్చించడం జరిగింది. అయితే ఈచర్చకి సంబంధించిన విషయంలో కొంతమందిని పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో థియేటర్లు తెరుచుకునే విషయంలో, టిక్కెట్ల రేట్లు పెంపుదలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సినీ పరిశ్రమలోని పెద్దలు అసంతృప్తిగా ఉన్నారనేది వాస్తవం. కరోనా కారణంగా ప్రజలకు థియేటర్లకు వచ్చి ఇబ్బంది పడడం కన్నా ఓటీటీ లో రిలీజ్ చేయడమే మంచిదని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తను నిర్మించిన నారప్ప చిత్రాన్ని ఓ టి టి లో రిలీజ్ చేయడం జరిగింది. పైకి కరోనా అనే విషయాన్ని ప్రస్తావించిన ఆంధ్రాలో ఉన్న టికెట్ల రేట్లు కి గిట్టుబాటు కాదనే భావన వారిలో ఉందనేది సుస్పష్టం. అయితే ఎవరు ఈ విషయాన్ని బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడడం లేదు. కారణం ఏదైనా తెలుగు సినీ పరిశ్రమ పెద్దలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య సానుకూల వాతావరణం అయితే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం కార్యాలయం నుంచి సినీ పెద్దలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికింది అనే సమాచారం వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిలో ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్లు విషయంపై చర్చించి సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని సినీ పెద్దల చర్చించుకున్నట్లు తెలుస్తుంది.
Comments are closed.