తెలంగాణ ప్రతినిధి:
ఖైరతాబాద్ నియోజకవర్గ వైయస్సార్ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా తనకు టికెట్ కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట రామిరెడ్డి ని కలిసి తన దరఖాస్తును అందజేశార యర్రవరపు రమణ.
రాజకీయ నేపథ్యం
తెలుగుదేశం పార్టీ లో క్రియాశీలక నేతగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్న విజయారావు శిష్యునిగా గుర్తింపు పొందారు. 1999 బంజారా హిల్స్ శాఖ కు సంబంధించి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 30సంవత్సరాలు పాటు తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల నేతగా ఉన్న రమణ, వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మార్చి 18 2021 న వైయస్సార్ తెలంగాణ పార్టీ లో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు రమణ. తదుపరి హైదరాబాద్ జిల్లా అడా కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు . రమణ పనిచేస్తున్న తీరును గమనించిన పార్టీ అధినేత 2022 లో ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడం జరిగింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తూ ఉన్నారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టిన 3000 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు 1000 కిలోమీటర్లు అధినేత తో పాటు నడిచాడు రమణ. ఈ నేపథ్యంలో రామ్ రెడ్డిని కలిసి తన దరఖాస్తు అందజేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ప్రతి రాజకీయ పార్టీ మా సామాజిక వర్గాన్ని అనగా ( నాయి బ్రాహ్మణ ) రాజకీయాలకు వాడుకున్నారే తప్ప, ఎవ్వరికి తగినంత ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వలేదని చెప్పారు. మొట్టమొదటిసారిగా మా అధినేత్రి వైయస్ షర్మిల మా కష్టా న్ని గుర్తించి మాకు కీలక బాధ్యతలు అప్పజెప్పిందని, అలాగే ఖైరతాబాద్ ఇన్చార్జిగా నన్ను నియమించిందని, టికెట్ కూడా నాకే వస్తుందని 100 ఆశ భావాన్ని వ్యక్తపరిచారు. అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు.
Comments are closed.