విశాఖ స్టీల్ ప్లాంట్ ని అడ్డుకోలేని ముఖ్యమంత్రి, ప్రత్యేక హోదా సాధిస్తాడా.. తేదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
విశాఖ ప్రతినిధి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తేదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం తెలుపుటకు విచ్చేసిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు అంశాలపై స్పందించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ను అడ్డుకోలేని ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా సాధిస్తాడా…. అంటూ ప్రశ్నించాడు ప్రైవేటీకరణ ఉద్యమానికి కలిసికట్టుగా పోరాడుతామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలానే పంచాయతీ ఎన్నికలు సంబంధించి మాట్లాడుతూ…..బెదిరింపు ఏకగ్రీవాలు ఒక విజయమేనా అన్నారు లోకేష్
తెలుగుదేశం కార్యకర్త నుంచి కార్యదర్శి వరకు వెన్ను చూపని పోరాటంతో పంచాయతీల్లో పట్టు సాధించామన్నారు. బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడం.. చంపేస్తామని హెచ్చరించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయడం ఓ విజయమేనా అని లోకేశ్ నిలదీశారు. జనం ఇంకా వైకాపా వైపే ఉన్నారని నమ్మకం ఉంటే.. వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా మూడు, నాలుగు విడతల్లో పోటీ చేయాలన్నారు. అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుందని ఆయన సవాల్ విసిరారు.
Comments are closed.