ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆలోచన ఏమిటి అనేది సర్వత్ర ఆసక్తి గా ఉన్నది. ఈ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ముందుగానే తమ అభ్యర్థి ని ప్రకటించింది అనుకోవాలి. వారి అభ్యర్థి ఎవరు అనేది సూచనప్రాయంగా తెలిపింది,అలానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు పనబాక లక్ష్మి పేరు ముందుగానే ప్రకటించారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలిసింది బీజేపీ, జనసేన పార్టీ లు.బీజేపీ వాళ్లు అయితే తిరుపతి గెలిచి తీరుతామని బహిరంగంగా మాట్లాడుతూన్నారు.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కి వెళ్లి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలవడం అక్కడ స్పష్టమైన సంకేతాలు ఏమి ఇవ్వకపోవడం తో ఆ పార్టీ క్యాడర్ కొంత నిరుత్సాహానికి గురి అయినట్లు ఉన్నారు.
గ్రేటర్ లో కూడా చివరి నిముషం వరకు పోటీ చేస్తామని,చివరకు బీజేపీ తో కలిసి పనిచేస్తామని చెప్పడంతో అంతా నీరుగారిపోయారు.గ్రేటర్ లో బలం చూపించే పరిస్థితి జనసేన కి ఉందా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక లో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గా జనసేన అభ్యర్థి ని నిలపాలని పవన్ కల్యాణ్ ఆలోచన. అయితే గతం లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎంపీ గా గెలిచిన నేపధ్యం ఉంది.ఆ కారణం చూపి బీజేపీ వారు బలం గాఅధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట తీసుకుని బీజేపీ అధిష్టానం ఆయన మాట వింటుందో లేక వారి పార్టీ వారికి అవకాశం ఇస్తుందో అనేది మరి కొన్ని రోజుల్లో తేలుతుంది. ఏదైనా జనసేన కి ఈ ఎన్నిక ఒక అవకాశం అనేది మాత్రం నిజం.
Comments are closed.