జగన్ పాలనలో సంక్షేమ పథకాల జాతర.. మేకపాటి విక్రమ్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి తోపుదుర్తి_ప్రకాష్_రెడ్డి
*జగన్ పాలనలో సంక్షేమ పథకాల జాతర..!*
●మేకపాటి విక్రమ్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..!
●ఆత్మకూరు మండల ఇంచార్జ్ తోపుదుర్తి_ప్రకాష్_రెడ్డి పిలుపు..!
గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాల జాతర జరుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరు నాగేశ్వర రావు, ఆత్మకూరు రూరల్ మండల ఇన్ఛార్జి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలోని బట్టేపాడు, నల్లపరెడ్డిపల్లి, నువ్వురుపాడు, అశ్వనిపురం, చెర్లోయడవల్లి, నాగులపాడు, నరంపేట, బోయల చిరువెల్ల, మహిమలూరు, రామస్వామిపల్లి, బసవరాజు పాలెం.. గ్రామాల్లో శనివారం ఆత్మకూరు శాసనసభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల సమావేశాల్లో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఆత్మకూరు నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రూ.500 కోట్ల అభివృద్ధి పనులు జరిగితే, మూడేళ్ల జగన్ పాలనలో 1630 కోట్ల రూపాయలు దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేశారని తెలిపారు. మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులకు ప్రతి నెలా సంక్షేమ పథకాలు నగదు రూపంలో వేల కోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కిందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసి ఐదేళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేకుండా జన్మభూమి కమిటీల ద్వారా ఆ పార్టీ కార్యకర్తలు ప్రజల సొమ్ము మింగేశారని తెలిపారు. మూడేళ్ల జగన్ పాలనలో ప్రతి ఏటా రూ.60వేల కోట్లు చొప్పున ఇప్పటి వరకు ఒక లక్షా 80 వేల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా అందజేసి చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Comments are closed.