: సాగుచట్టాలను రద్దు చేస్తున్నాం,: ప్రధాని మోదీ
: సంవత్సర కాలంగా రైతులు ఉద్యమం
: సుప్రీం కోర్టులో కేసు విచారణ
;పలు దఫాలుగా కేంద్రంతో చర్చలు
: ఎట్టకేలకు ప్రధాని ప్రకటన గత సంవత్సర కాలంగా రైతులు కేంద్రం తీసుకువచ్చిన 3 సాగు చట్టాలు రద్దు చేయాలని చేస్తున్న ఉద్యమంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రధాన మోదీ మాట్లాడుతూ 3 సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో అధికారకంగా ప్రకటన చేస్తామని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు సంక్షేమం అభివృద్ధి కొరకు మా ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. గత సంవత్సర కాలంగా రైతులు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘ నాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపినా సఫలీకృతం కాలేదు. రైతులు సాగునీటి చట్టాలను రద్దు చేయాలని ఒకే ఒక అజెండాను ముందు ఉంచడం తో దానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించలేదు. దీనికితోడురైతు సాగు చట్టాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు రైతు సంఘం నాయకులు . ఆ కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే, మరికొన్ని రోజుల్లో పంజాబ్ ఉత్తరప్రదేశ్ తో పాటు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన రావడంతో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ప్రధాని మోదీ రైతులకు క్షమాపణ చెప్పడం కొసమెరుపు.
Next Post
Comments are closed.