తేదీ: జనవరి 21, 2023
*స్థలం: విశాఖపట్నం*
*బీచ్ ఐటీ డెస్టినేషన్ హబ్ గా వైజాగ్: మంత్రి గుడివాడ అమర్నాథ్*
*విశాఖకు 2 నెలల్లో పరిపాలన రాజధాని*
రెండునెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ నగరం పరిపాలన రాజధాని కాబోతోందని ఐటీ మంత్రి గుడివాడన అమర్నాథ్ తెలిపారు. *వైజాగ్ సిటీని ఐటీ హబ్ గా చేయడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం అన్నారాయన.* విశాఖలో రెండోరోజు ఇన్ఫినిటి వైజాగ్ సదస్సులో మంత్రి మాట్లాడారు.
భారతదేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదవ స్థానంలో ఉందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. *అతిత్వరలో విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. అంతేకాదు అదానీ డేటా సెంటర్ ని కూడా ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.*
రెండోరోజు ఇన్ఫినిటి వైజాగ్ సదస్సులో మంత్రి అమర్నాథ్ తోపాటు ప్రముఖ ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖలో పెట్టుబడులకు ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ ఎంతో ఉపయోగపడిందని ఐటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. *భవిష్యత్తులో వైజాగ్ ఆసియాలోనే డిజిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.*
Comments are closed.