*గౌతముడు ఇచ్చిన మాటను నెరవేర్చిన విక్రముడు…*
*తీరిన దశాబ్దాల కల*
*7.5 కోట్లతో నక్కల వాగు హైలెవల్ బ్రిడ్జి*
*అన్న వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్న విక్రముడు*
ఏ.ఎస్.పేట మండలం,ఏ.ఎస్.పేట గ్రామమునకు సమీపంలో వున్న నక్కల వాగు బ్రిడ్జి పురాతనమైనదై కూలిపోయే పరిస్థితుల్లో వున్నది,వర్షాకాలంలో ఎక్కువగా వర్షములు వచ్చినప్పుడు బ్రిడ్జి మీదకు నీటి ప్రవాహము చేరి రాకపోకలు బంద్ అయ్యేవి,ఏ.ఎస్.పేట గ్రామములోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ ఖాజా నాయబ్ రసూల్ వారి దర్గా వుండటముతో భక్తులు,యాత్రికులు చాలా ఇబ్బందులు పడేవారు,,గతంలో దివంగత మంత్రివర్యులు,కీర్తిశేషులు,స్వర్గీయ శ్రీ.మేకపాటి గౌతం రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళగా నూతన బ్రిడ్జి నిర్మాణమునకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రాసెస్ లో పెట్టి వున్నారు,శ్రీ.గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక హఠాత్మరణంతో ఆగి వున్న ఫైలు శ్రీ.మేకపాటి.విక్రమ్ రెడ్డి గారు నూతన ఆత్మకూరు శాసనసభ్యులు అయిన తరువాత ప్రత్యేక దృష్టిసారించి,తన అన్న అయిన గౌతమ్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో,సంకల్పంతో,పట్టుదలతో నక్కల వాగు పాత బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి 7.50కోట్లతో మంజూరు చేయించారు,టెండర్లు కూడా పిలిచేటట్లు చేశారు.
వాహన రాకపోకలకు ఎంతో ఇబ్బందికరంగా వున్న నక్కల వాగు పాత బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి మంజూరుకు కృషి చేసిన దివంగత మంత్రివర్యులు,కీర్తిశేషులు,స్వర్గీయ శ్రీ.మేకపాటి.గౌతం రెడ్డి గారికి మరియు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు .విక్రమ్ రెడ్డి ఏ.ఎస్.పేట మండల ప్రజలు,వాహన చోదకులు,యాత్రికులు,భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు,ధన్యవాదములు తెలియజేస్తున్నారు.
అదేవిధంగా తెల్లపాడు చెరువు సమీపంలో వున్న చవిటి వాగు బ్రిడ్జి కూడా త్వరగా మంజూరు చేసి వాహన చోదకులకు,రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మండల ప్రజలు,యాత్రికులు,భక్తులు కోరుతున్నారు. మేకపాటి కార్యాలయం
Comments are closed.