దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కఠినంగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. వెసులుబాటు ఇచ్చిన సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటున్నారు అని, మాస్కులు కూడా సరిగా ధరించడం లేదనేది తెలుస్తుంది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందువలన మెజారిటీ ప్రజలందరూ టీకా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. నిరక్షరాస్యులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని, అలానే హిందీ ఇంగ్లీష్ రాని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పోర్టల్ ని తెలుగుతోపాటు , మరాఠీ పంజాబీ, గుజరాతి, మలయాళం, కన్నడ ,అస్సామీ ఒడిస్సా, ప్రాంతీయ భాషల లోకి తీసుకు వచ్చింది. దేశంలో 18 సంవత్సరాలు పైబడి టీకా తీసుకోవాలనుకునే వాళ్లంతా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ని వినియోగించుకోవాలి.
Comments are closed.