తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి బోతున్న వైయస్ షర్మిల గత కొంత కాలంగా కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తన కార్యాలయానికే పరిమితమయ్యారు. భవిష్య ప్రణాళికలు అన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు అని అనుకుంటున్న సందర్భంలో ఈరోజు తెరాస అధ్యక్షుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తో నిరసన తెలుపుతూ తెలంగాణకు చెందిన యువకుడు వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో వెంకటేష్ కుటుంబానికి వైయస్ షర్మిల అండగా ఉంటుందని గతంలోనే ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఈ రోజు మెదక్ జిల్లాలోని శేరిల్లా గ్రామంలో వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది, తదనంతరం మీడియాతో మాట్లాడుతూ…. ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో ఉందంటే దీనికి ప్రభుత్వం సిగ్గుపడాలి అని అన్నారు. దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని షర్మిల తెలియజేశారు. కెసిఆర్ తన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి , ప్రజల పిల్లల కి ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments are closed.