రాష్ట ప్రభుత్వం ఆదాయంలో కీలక శాఖ స్టాంప్స్&రిజిస్ట్రేషన్ .భూముల క్రయవిక్రయాలు ద్వారా ప్రభుత్వానికి కు చాలా ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ శాఖ మీద ప్రజలకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ అంటేనే అవినీతి తిమింగలాలూ ఇక్కడ తిష్ట వేసి ఉంటాయి అని, ప్రతి చిన్న పనికి డబ్బులు వసూలు చేస్తారనే అభిప్రాయం ఉన్నది. ప్రజల అవసరాలు దృష్ట్యా ఎంతో కొంత సమర్పించు కొని వారి పని చేసుకోవడంవారికి అలవాటు అయిపోయింది.ఈ ఆరోపణలు నేపధ్యంలో ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. దస్థావేజుల రిజిస్ట్రేషన్ సందర్భంగా ఏదైనా అవినీతి జరిగినా ఎవరైనా డబ్బులు అడిగినా నేరుగా ప్రభుత్వ నికి ఫిర్యాదు చేసే విధంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ని ఏర్పాటు చేసే విధంగా ఆలోచిస్తున్నారు అధికారులు. అలానే ఏదైనా రిజిస్ట్రేషన్ సమయంలో ఫిర్యాదు వచ్చిన సంబంథిత సబ్ రిజిస్ట్రార్ ని నేరుగా ఫోన్ లొనే విచారణ చేసే విధంగా కూడా ఒక ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఏదీ ఏమైనా ఈ శాఖ పై పూర్తి దృష్టి సారించాలి ఈ ప్రభుత్వం
Comments are closed.