The South9
The news is by your side.
after image

నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న దక్షిణాది సంచలనం ప్రేమదేశం

  • నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న దక్షిణాది సంచలనం ప్రేమదేశం
  • ప్రతి కాలేజ్ వాడి గుండెల్లో ముస్తఫా- ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా
  • ఏ ఆర్ రెహమాన్ సంగీతానికి యువత ఫిదా
  • కదీర్ దర్శకత్వం లో ప్రేమకి స్నేహానికి సరికొత్త నిర్వచనం
  • నిర్మాత కె.టి కుంజుమోన్ భారీ సాహసం                                                                                                          ప్రేమ దేశం’ ఈ చిత్రం పేరు వినగానే అప్పటి తరం యువతకి ఒక సంచలనం అనే చెప్పాలి. ప్రేమ, స్నేహం అనే అంశాలు జోడించి అద్భుతంగా తీసిన చిత్రం ప్రేమ దేశం. 1996 ఆగస్టు 23న తమిళ మాతృక “కాదల్ దేశం” అనే తమిళ చిత్రానికి తెలుగు డబ్బింగ్ గా ప్రేమ దేశం అనే పేరుతో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమకి నిర్మాతగా అడుగుపెట్టిన కే .టీ కుంజు మోన్ మొదటి చిత్రంగా జెంటిల్మెన్ అనే చిత్రాన్ని నిర్మించిన తరువాత కదీర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. పెద్దగా పరిచయం స్టార్ డం లేని అబ్బాస్ ,వినీత్ లను హీరోలుగా , బాలీవుడ్ హీరోయిన్ టబు పి హీరోయిన్ గా తీసుకుంటూ 10 కోట్ల బడ్జెట్ కేటాయించారు అంటే నిర్మాత సాహసం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాది చిత్రాలలో మొదటిసారిగా భారీ సెట్టింగులు వేసిన చిత్రంగా ప్రేమ దేశం అని చెప్పవచ్చు. పాండిచ్చేరి, కోయంబత్తూర్, తదితర ప్రాంతాల్లో , మోడరన్ కాలేజ్ క్యాంపస్ ను, బీచ్ పక్కన రోడ్లను అద్భుతమైన సెట్టింగుల రూపంలో పరిచయం చేసిన చిత్రంగా ప్రేమ దేశం నిలుస్తుంది. ఇక ఈ చిత్ర విజయంలో మరొక కీలక పాత్ర సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్. చిత్రంలోని ఆరు పాటలు కి వెస్ట్రన్, మెలోడీ లను జోడించి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికీ ఈ చిత్రంలోని ముస్తఫా ముస్తఫా అనే పాట నేటికి కాలేజీ యానివర్స్ డే లలో వినిపిస్తూనే ఉంటుంది. అలానే ఈ చిత్రానికి కె.వి.ఆనంద్ అద్భుతమైన ఛాయాగ్రహణం అందించారు. నేటితో ఈ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ‘దసౌత్ 9 ‘తరపున చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు.        
Post midle

Comments are closed.