The South9
The news is by your side.
after image

చిన్న సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించాలి… చిన్నగా మౌత్ పబ్లిసిటీతో ‘7 డేస్ 6 నైట్స్’ కలెక్షన్స్ ప్రతి షోకి పెరుగుతున్నాయి

*చిన్న సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించాలి… చిన్నగా మౌత్ పబ్లిసిటీతో ‘7 డేస్ 6 నైట్స్’ కలెక్షన్స్ ప్రతి షోకి పెరుగుతున్నాయి*

*- సక్సెస్ మీట్‌లో మెగా మేకర్ ఎంఎస్ రాజు*

 

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ‘7 డేస్ 6 నైట్స్’ ఈ శుక్రవారం విడుదలైంది. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా… మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అన్ని ఏరియాలు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ లభిస్తోన్న నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు.

 

సక్సెస్ మీట్‌లో మెగా మేకర్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ ”థియేటర్‌కు వెళ్లి సినిమా చూశా. ప్రేక్షకుల స్పందన చూశాక చాలా సంతోషంగా అనిపించింది. థియేటర్ లోపలికి వెళ్లే ముందు ఇద్దరు హీరోయిన్లను ఎవరో అమ్మాయిలు అనుకున్నారు. సినిమా పూర్తయిన తర్వాత వాళ్ళను అందరూ చుట్టుముట్టారు. రోజు రోజుకి పెరిగే చిత్రమిది. హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 350 మంది జనంతో చూశాం. మార్వలెస్ ఎక్స్‌పీరియ‌న్స్‌. మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మంచి ఎమోషన్… ఈ రెండూ ఒకేలా వెళుతుంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అది చూసి మేం ఆనందించాం. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు. మేం ఆ కష్టం పడ్డాం. ప్రతి షోకి అన్ని చోట్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ ఫుల్. ‘శంకరాభరణం’ నుంచి ఇప్పటి వరకు క్లాసిక్ సినిమాలు మౌత్ టాక్ వల్ల పెరిగాయి. యూత్‌కు విపరీతంగా నచ్చింది. మార్నింగ్ షో చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు. మేం హ్యాపీగా ఉన్నాం. అయితే, ఒక చిన్న వెలితి. ఈ రోజు మన సినిమా ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. అది ఎవరూ బయటపడరు. ఎందుకంటే… పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ పాన్ ఇండియా హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారిలా, కె బాలచందర్ గారిలా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే? ఈ రోజు ‘హ్యాపీ డేస్’ లాంటి సినిమాలు వస్తే? ఏంటని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండస్ట్రీ తాలూకా పోకడ మారింది. ఎందుకు మారిందంటే… ఈ రోజు ఫోనులో ప్రతిదీ అందుబాటులో ఉంది. చాలా ఓటీటీ వేదికలు వచ్చాయి. ఈ పోటీలో కరోనా ఒకటి. నేను పెద్ద పెద్ద సినిమాలు తీశాను. లో బడ్జెట్ సినిమాలు తీశాను. అప్పుడు టికెట్ ధర ప్రేక్షకులకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంతా హ్యాపీ. నా రిక్వెస్ట్ ఏంటంటే… పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోండి. చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్ లోపు సినిమాలకు రేట్లు తగ్గించండి. నేను ఒక థియేటర్‌కు వెళితే… టికెట్ రేటు 200 పెట్టారు. చిన్న సినిమాకు అంత డబ్బులు పెట్టి నేను ఎందుకు చూస్తాను? మా సినిమాకు టాక్ బావుంది. జనాలు వస్తున్నారు. ఏవరేజ్ ఫిల్మ్ అయితే ఓటీటీలో వస్తే చూద్దామని అనుకుంటున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చూడటానికి టికెట్ రేటు ఎంత తగ్గిస్తారు? 30 శాతమా? 40 శాతమా? నేను చిన్న సినిమా తీశానని, లేదంటే నా సినిమా కోసమో అడగటం లేదు. గతంలో దాసరి గారు, ఆ తర్వాత భరద్వాజ్ గారు, నారాయణమూర్తి గారు అడిగారు. ఇవాళ నేను అడుగుతున్నాను. నా సినిమా కోసం అయితే విడుదలకు ముందు చెప్పేవాడిని. చిన్న సినిమా కోసం ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే ఇదొక పెద్ద సినిమాల ఇండస్ట్రీగా ఉంటుంది తప్ప చిన్న సినిమాల ఇండస్ట్రీగా ఉండదు. చిన్న చిన్న సినిమాలు తీయాలనుకునే ఔత్సాహిక దర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ‘నేను ఓటీటీకి వెళ్లాలా? థియేటర్లకు రాలేనా?’ అని ఎందుకు అనుకోవాలి. నాకు అర్థం కావడం లేదు… థియేటర్లలో పెద్ద పెద్ద సినిమాలే విడుదల చేయాలా? దీనికి పరిష్కారం ఏమిటి? ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. పెద్ద సినిమాలకు ఎంత రేట్ అయినా పెట్టుకోండి. క్రేజ్ ఉంది కాబట్టి థియేటర్లకు జనాలు వస్తారు. చిన్న సినిమాకు ఏదైనా చేయండి. లేదంటే చిన్న సినిమా రాదు” అని అన్నారు.

 

Post Inner vinod found

హీరో రోహన్ మాట్లాడుతూ ”మా ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూశా. నా అనుభూతి మాటల్లో వర్ణించలేను. సినిమాల్లో అవకాశం వస్తుందా? రాదా? అని ఆలోచిస్తున్న సమయంలో ఎంఎస్ రాజు గారి సినిమాలో అవకాశం వచ్చింది. నన్ను నమ్మిన ఆయనకు థాంక్స్. ఇంటర్వెల్ తర్వాత, సినిమా అయ్యాక ప్రేక్షకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. క్యారెక్టర్లను చాలా మెచ్చుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా నానమ్మ కూడా చూశారు. ఆవిడకు 80 ఏళ్ళు. అన్ని వయసుల వారికి నచ్చే చిత్రమిది” అని అన్నారు.

 

హీరోయిన్ మెహర్ చాహల్ మాట్లాడుతూ ”సినిమా ప్రపంచంలోకి తొలి అడుగు వేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ఎంఎస్ రాజు గారికి ముందుగా థాంక్స్. ప్రేక్షకుల నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభిస్తోంది. అమేజింగ్ ఫిల్మ్ ఇది. తప్పకుండా థియేటర్లలో చూడల్సిన చిత్రమిది” అని అన్నారు.

 

హీరోయిన్ కృతికా శెట్టి మాట్లాడుతూ ”సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంఎస్ రాజుగారికి థాంక్స్. ఇదొక ఫీల్ గుడ్ సినిమా. థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేయండి” అని అన్నారు.

 

Post midle

ఈ కార్యక్రమంలో హీరో & నిర్మాత సుమంత్ అశ్విన్, ఎంఎస్ రాజు కుమార్తె రిషితా దేవి, నిర్మాత రజనీకాంత్ ఎస్, సహ నిర్మాత జె. శ్రీనివాసరాజు, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి తదితరులు పాల్గొన్నారు.

Post midle

Comments are closed.