The South9
The news is by your side.
after image

‘ఇది మంచి ప్రభుత్వం’ అనడానికి ఇదో తార్కాణం:రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్

 

*సీఎం చంద్రబాబు చలవతో గిరిజన డీఎస్సీ అభ్యర్ధులకు ఉచిత కోచింగ్ సెంటర్లు*

*‘ఇది మంచి ప్రభుత్వం’ అనడానికి ఇదో తార్కాణం*

8 ఐటీడీఏల పరిధిలో అభ్యర్ధులందరూ లబ్దిపొందేలా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు ఎంతో ముదావహం

Post Inner vinod found

జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏనాడైనా గిరిజనుల కోసం శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారా?

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ 

అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ప్రకటించడంతో పాటు ఇప్పుడు ఆ డిఎస్సీ పరీక్షకు సిద్దమవుతున్న గిరిజన విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్లను ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి ప్రసాద్ కొనియాడారు. ఎనిమిది ఐటీడీఏల పరిధిల్లోని విద్యార్ధులందరికీ ఉపయోగపడేలా కోచింగ్ సెంటర్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని త్వరలో డీఎస్సీ అభ్యర్ధులకు అవి అందుబాటులోకి రానున్నాయని కొండారెడ్డి అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రత్యేకించి పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావాలంటే సరైన శిక్షణ ఎంతో అవసరమని..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలువతో జనరల్ కేటగిరి విద్యార్ధులతో సమానంగా గిరిజన విద్యార్ధులు పోటీపడి ఉద్యోగాలు సాధించే అవకాశం మెండుగా ఉందన్నారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మైదాన ప్రాంతాల వారిలా శిక్షణా కేంద్రాలకు వెళ్లాలంటే కొండప్రాంత గిరిజన వాసుల ఆర్ధిక స్థోమత సరిపోదని గుర్తించి చంద్రబాబు నాయుడు అల్లూరి జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో ఉండే నిరుద్యోగులకు పాడేరులో కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నారని శ్లాఘించారు. రాష్ట్రంలో మొత్తం పరీక్షకు పోటీపడుతున్న గిరిజన అభ్యర్ధులు దాదాపు 10 వేలకు పైగా ఉన్నారని..రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఐటీడీఏ పరిధిలో వేలాది మంది విద్యార్ధులు లబ్దిపొందనున్నారని అన్నారు.

Post midle

డీఎస్సీ పరీక్షకు పోటీ అభ్యర్ధులు బయట మార్కెట్‌లో శిక్షణ తీసుకోవాలంటే ఒక్కో అభ్యర్ధికి రూ.35 వేల వరకు తీసుకుంటున్నారని..ఈ లెక్కన 10 వేల మంది విద్యార్ధులకు రూ.35 కోట్లు వరకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించడం చరిత్రలో మిగిలిపోతుందని కొనియాడారు. త్వరలో ప్రవేశ పరీక్ష నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేసి విశాఖపట్నం వేపగుంట యువజన కేంద్రంలో డీఎస్సీ నిపుణులతో కోచింగ్ ఇప్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతీ గిరిజనుడు ధన్యవాదాలు తెలుపుకోవాలని ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రతీ ఒక్కరికీ చెప్పాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఊరించి ఐదేళ్ల పాటు నిరుద్యోగులను మోసం చేసినందుకు జగన్ రెడ్డి సిగ్గుపడాలని తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల బాధలు అర్ధం చేసిన డీఎస్సీ ఇవ్వడంతోపాటు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం అంటే మంచి ప్రభుత్వం కాక మరేమిటో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు

****

Post midle

Comments are closed.