తెలంగాణ : దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు, పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అత్యధికంగా నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి అంటే కరోనా తీవ్రత ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ లో మాత్రం లాక్ డౌన్ పెట్టేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన కేసులు నియంత్రణలోకి రాలేదని అన్నారు. మే 15 వ తారీఖు నుండి కేసులు తగ్గుముఖం పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు అని అందువలన లాక్‌డౌన్ విధించమని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి పరిస్థితి వివరించామని 25 వేల రెమిడి సర్ ఇంజెక్షన్ల డోసులు కోరానని తెలిపారు.
Comments are closed.