అమరావతి : ఆంధ్ర రాష్ట్ర కొత్త పోలీస్ బాస్ గా కసిరెడ్డి రాజేంద్ర రెడ్డి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా డీజీపీగా కొనసాగిన గౌతమ్ సవాంగ్ ని జిఎడి కి రిపోర్టు చేయాలని ఆదేశించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర డిజిపి ని మారుస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ గా రాజేంద్రనాథ్ రెడ్డి ని నియమించడం జరిగింది. ఈ మధ్య ఉద్యోగులు విజయవాడ లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలిరావడంతో పోలీస్ వైఫల్యం ఉందని, దీనికి నిఘా వర్గాలు సైతం సమగ్ర సమాచారాన్ని అందించడంలో వైఫల్యం చెందారని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అలానే ఎమ్మెల్సీ అశోక్ బాబు ను సిఐడి పోలీసులు అరెస్టు చేసిన కేసులో ఎఫ్ఐఆర్ లో నమోదు కానటువంటి సెక్షన్లను రిమాండ్ రిపోర్టు లో రాయడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టులో లాయర్లు ప్రశ్నించడంతో జడ్జి అశోక్ కుమార్ కు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇలా పలుఅంశాలపై ముఖ్యమంత్రి జగన్ గౌతమ్ సవాంగ్ పై అసంతృప్తి గా ఉన్నాడని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 1992 బ్యాచ్ కి చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని పోలీస్ బాస్ గా నియమించినట్లు తెలుస్తోంది.
Comments are closed.