నెల్లూరు: ప్రముఖ న్యాయవాది, రంగస్థల నటులు మాజీ ఆలిండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు మన పాటి సాల్మన్ , ఆకస్మికంగా మరణించడంతో ఆయన పార్థివదేహానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాల్మన్ అన్న తో 87 నుంచి పరిచయం ఉందని కాంగ్రెస్ నాయకుడిగా, న్యాయవాదిగా పలు సమస్యలపై పేద దళిత బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారని ఆయన మృతి తీరనిలోటని అన్నారు. ఆయన కుమారుడు సౌత్ నైన్ ఎడిటర్ మన పాటి చక్రవర్తి ని ఓదారుస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలానే మాజీ పిసిసి ఉపాధ్యక్షులు సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణ, నగరంలోని ప్రముఖ న్యాయవాదులు, స్థానిక కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, దిలీప్,, విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులరెడ్డి, విద్యుత్ శాఖఏం సి చైర్మన్ ఏసు నాయుడు , సివిల్ ఇంజనీర్ కళాధర్ నగరంలోని తదితర ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు.
నేపథ్యం. మన పాటి నతానియేలు మరియమ్మ కి చివరి సంతానంగా మన పాటి సాల్మన్ జన్మించారు. వారి తల్లిదండ్రులు హెడ్మాస్టర్ టీచర్ గా ఉండడంతో విద్యాభ్యాసం కోసం నెల్లూరు నగరానికి రావడం జరిగింది. వారి తండ్రి నతానియల్ ప్రముఖ కవి గుర్రం జాషువా గారి తో స్నేహం ఉండడంతో చిన్నతనం నుంచే నాటకరంగం వైపు మొగ్గు చూపారు. చిన్నతనంలో క్రిస్టియన్ నాటకంలో అడుగులు వేసిన సాల్మన్ ప్రముఖ రంగస్థల నటులుగా రేబాల రమణ, బండారు సుబ్బారావు తదితరులతో హరిశ్చంద్ర నాటకంలో హరి చంద్రుడు గా నటించి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. నాటకరంగంలో కొనసాగుతూనే బి ఏ బి ఎల్ చదువి న్యాయవాది వృత్తిని ఎంచుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారు. 2014లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి పది వేల పైచిలుకు ఓట్లను సంపాదించి నాలుగో స్థానంలో నిలిచారు. వివాదరహితుడిగా అందరిలో మంచివాడిగా, శత్రువు అంటూ ఎవరూ లేని జీవితం గడుపి.. ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆయన మృతి వారి కుటుంబ సభ్యులకే కాక బడుగు నెల్లూరు జిల్లాలోని బలహీన వర్గాలకు తీరనిలోటు.
Comments are closed.