పోలీస్ అధికారులు తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గడ్ కి చెందిన ఐపీఎస్ అధికారి గుర్జిందర్ పాల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం విచారించిన సందర్భంలో పోలీస్ అధికారులపై జస్టిస్ రమణ మాట్లాడుతూ …. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి పోలీస్ అధికారులు వత్తాసు పలకడం, మరల ప్రభుత్వం మారిన తర్వాత అధికారులపై వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. చత్తీస్గడ్ ఐ.పి.ఎస్ అధికారిగుర్జిందర్ పాల్ సింగ్ తనపై పై దేశద్రోహం కేసు నమోదు అయిందని దానిని కొట్టివేయాలని ఛత్తీస్ ఘడ్ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు . ఈ కేసుకు సంబంధించిన విచారణ లో భాగంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ దేశంలో ప్రస్తుతం పరిస్థితులు విచారకరంగా ఉన్నాయని పోలీస్ అధికారులు రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరించ కూడదని అన్నారు.
Comments are closed.