The South9
The news is by your side.
after image

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వాహణలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

అమరావతి :  దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుంటే ఎప్పుడెప్పుడా లాక్ డౌన్ పెడతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రజలు ఎందుకనో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారు. వైన్ షాపుల దగ్గర గుంపులు గుంపులుగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప వేరొక పరిష్కారం కనిపించటంలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి పరీక్షల తోపాటు మే 5న షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.                                                                                      ఏ రాష్ట్రంలో రద్దు కాలేదని అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందులో కరోనా సెకండ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎందుకో ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతుందని మేధావి వర్గం అంటున్నారు. పిల్లలకి విద్య అవసరమే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలు రాయడం ఎంత వరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలి అని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు.

Post midle

Comments are closed.