బ్రాండింగ్ , ప్రమోషన్, అమ్మకాలు మరింత పెంచడమే లక్ష్యం : పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
అమరావతి. బ్రాండింగ్ , ప్రమోషన్, అమ్మకాలు మరింత పెంచడమే లక్ష్యం : పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అవసరమైతే లేపాక్షి వస్తువుల కోసం ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు
ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మరింత వినూత్న పద్ధతుల్లో అమ్మాలి, డెలివరీ వేగం పెంచాలి : మంత్రి మేకపాటి
లేపాక్షి హస్తకళారూపాలు సహా ఆప్కో వస్త్రాల అమ్మకాల విలువను పెంచేదిశగా బ్రాండింగ్ చేసే ఒక బ్రాండ్ అంబాసిడర్ నియమించే ఆలోచనను పరిశీలించాలని చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆ శాఖను ఆదేశించారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన చేనేత,జౌళి శాఖపై మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా సమీక్షా సమావేశం
జరిగింది.
అత్యుత్తమ హ్యాండ్లూమ్ క్లస్టర్ ల ఫోటోలు తీసి నివేదిక అందించాలని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆయా క్లస్టర్లు అత్యుత్తమంగా ఉండడానికి గల కారణాలపై తర్వాతి సమావేశానికి సమగ్ర వివరాలందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పవర్ లూమ్ యూనిట్లకు అందించే పవర్ టారిఫ్ వివరాలు, ముద్ర లోన్ ల గురించి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు.
ఆన్ లైన్ మార్కెటింగ్ ని పెంచి, అమ్మకాలను మరింత విస్తృతస్థాయికి చేర్చాలన్నారు.
ఈ -కామర్స్ ద్వారా వచ్చే ఆర్డర్లను 3 రోజులలోగా డెలివరీ చేసే స్థాయికి చేరాలన్నారు మంత్రి మేకపాటి. ఈ సందర్భంగా ఆయన ఖాధీ ప్రోగ్రామ్, ప్రధాన మంత్రి ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్(పీఎమ్ఈజీపీ), ఎంటర్ ప్యూనర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(ఈడీపీ) లపై చేనేత జౌళి శాఖతో చర్చించారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 షోరూంలు ఉండగా ఏపీయేతరవి అందులో 3 ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ అర్జునరావు వెల్లడించారు.
కోవిడ్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినా స్వయంగా నడపగలిగినవే అన్నీ అని ఏపీహెచ్డీసీఎల్ ఎండీ అర్జునరావు మంత్రి గౌతమ్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి
తోలు బొమ్మలు, ఆదివాసి పెయింటింగ్స్, ఏటికొప్పాక, కొండపల్లి , బంజారా ఎంబ్రయిడరీ వస్తువల తయారీలో మరింత శిక్షణనందిస్తే నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ఎక్కువ నాణ్యత, రకరకాల డిజైన్ల తయారీ వల్ల ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా తీర్చదిద్దడంపై అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు.
ఒక జిల్లా – ఒక వస్తువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు.
తిరుపతి బాలాజీ, పుట్టపర్తి సాయిబాబ వంటి దేవుని ప్రతిమల తయారీలో ఇంకా నైపుణ్యం పెంచి..ఎక్కువ ప్రతిమల తయారీపై శ్రద్ధ వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించేలా బ్రాండింగ్, బ్రాండ్ అంబాసిడర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండేళ్లకోసారి మారే విధంగా బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు విషయంపైనా ఆలోచించాలని చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఆప్కో ఛైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, హస్తకళల అభివృద్ధి సంస్థ(ఏపీహెచ్డీసీఎల్) ఛైర్మన్ బండిగింజల విజయలక్ష్మి, చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్, ఏపీహెచ్డీసీఎల్ డైరెక్టర్ అర్జున్ రావు, జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.
మంత్రి మేకపాటితో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజు భేటీ
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న స్కిల్ కాలేజీల టెండర్లపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సంకల్పించిన నైపుణ్య కాలేజీల ఏర్పాటు ఏడాదిలోగా పూర్తవ్వాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి స్కిల్ కాలేజీల నిర్మాణాలపై పూర్తిగా ఫోకస్ చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీఎస్ఎస్డీసీ ఉన్నతాధికారులు, ఆర్ అండ్ బీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీఎస్ఎస్డీసీకి చెందిన ముగ్గురు ఛీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
అమరావతి.
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేసిన ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలను స్థాపిస్తాం : మంత్రి మేకపాటి
ఈ ఏడాదే పాలిటెక్నిక్ కాలేజీల్లో 5 కొత్త టెక్నికల్ కోర్సులు ప్రవేశపెడుతున్నాం
అమరావతి, సెప్టెంబర్, 15: రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలను స్థాపిస్తామని ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ సంవత్సరం నుండే పాలిటెక్నిక్ కాలేజీల్లో ఐదు కొత్త టెక్నికల్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్ల ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలోని సమావేశమందిరంలో మంత్రి గౌతమ్ రెడ్డి.. పాలిసెట్ -2021 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను స్థాపిస్తామని తెలిపారు.
ఏపీ పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 (పాలిసెట్) ఫలితాలు విడుదల అనంతరం మంత్రి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 (94.2%) మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన కె.రోషన్‌లాల్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌వర్ధన్ మొదటి ర్యాంకు సాధించారు. వీరిరువురికి 120 మార్కులు వచ్చాయని మంత్రి ప్రకటించారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం, అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు అని మంత్రి పేర్కొన్నారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.
మంత్రి మేకపాటి మాట్లాడుతూ..మరో వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 81 వేల మందికి రూ. 128 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ. 54 కోట్లు విద్యార్థులకు అందించామన్నారు. ‘‘కొన్ని రకాల ప్రత్యేక పరిస్థితుల వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేవారన్నారు. ఆ సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది’’ అని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు.
పాలిసెట్-2021(1AP Polycet 202) రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్(Official Website)లో చెక్ చేసుకోవచ్చని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్ మెంట్ & ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.