తేదీ : 21-07-2023*
: వెంకటగిరి*
*వాలంటీర్లను అవమానించేందుకు పవన్ కళ్యాణ్ కు ఎంత ధైర్యం – సీఎం జగన్*
*ప్రజలకు సేవ చేయడమే వాలంటీర్ల తప్పా.. వాలంటీర్లు నా ఫ్యామిలీ.. సీఎం జగన్*
*దత్తపుత్రుడు పదేళ్లుగా చంద్రబాబు దగ్గర వాలంటీర్‌గా పనిచేస్తున్నారు*
*80వేల మంది నేతన్నల ఖాతాల్లోకి రూ.193.64 కోట్ల జమ… నేతన్న నేస్తం కార్యక్రమంలో సీఎం జగన్*
నేతన్నలకు అండగా ఉండేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు అండగా ఉండేలా ప్రతి పనిలోనూ నవరత్నాల పథకాలను తీసుకొచ్చామని అందులో భాగంగా నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ సందర్బంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని నేతన్నల ఖాతాల్లో నిధులు జమ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇప్పటి వరకు వైయస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా రూ.967.77 కోట్లు నేరుగా నేతన్నల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదికాకుండా.. నేతన్నల పెన్షన్ కోసం రూ. 1.396 కోట్లు, ఆప్కోకు మరో రూ.468.84 కోట్లు.. మొత్తం ఇప్పటివరకు ఈ మూడింటి ద్వారా రూ. 2,835.06 కోట్లు అందించినట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ. 193.64 కోట్లను జమ చేసినట్లు సీఎం జగన్ చెప్పారు. ఇప్పటివరకు ప్రతీ నేతన్నకు అందించిన మొత్తం సాయం ఇవాళ్టితో కలిపి ఒక్కొక్కరికి రూ.1, 20,000 వేలు జమ చేసినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. వైయస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా.. చేనేత కార్మికులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ తమ జీవితాలను మెరుగుపర్చుకుంటున్నారని జగన్ తెలిపారు.
*దత్రపుత్రుడు, చంద్రబాబుకు సీఎం చురకలు…*
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుకు శ్రీకారం చుట్టిందని.. చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే తన మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేశాడని సీఎం జగన్ అన్నారు. ఇక మంచి చేసే వ్యవస్థలను, మంచి చేస్తా ఉన్న వాలంటీర్లపై కొందరు ఏవేవో మాట్లాడుతున్నారని,, సంస్కారం ఉన్న ఏ వ్యక్తులు అలాంటి వ్యవస్థలపై వ్యాఖ్యలు చేయరని సీఎం దుయ్యబట్టారు. ఎండైనా, వానైనా, చలైనా.. సూర్యోదయం ముందే.. వాలంటీర్ ఇంటికి వచ్చి పింఛను ఇచ్చే తమ్ముళ్లు మన వాలంటీర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా పథకాలు ఇస్తున్న ప్రభుత్వం తమదని, కులం, మతం, పార్టీ, వర్గం చూడకుండా పథకాలు అందిస్తుంది వాలంటీర్లే అని ఆయన అన్నారు. ఇలాంటి వ్యవస్థలపై దత్తపుత్రుడు, చంద్రబాబు, ఎల్లోమీడియా తప్పుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
*రామోజీ స్క్రిప్ట్, చంద్రబాబు నిర్మాత, దత్తపుత్రుడి నటన…*
ప్రజలకు మంచి చేస్తున్న వ్యవస్థలపై తప్పుడు రాతలతో రామోజీ రావు స్క్రిప్ట్ అందిస్తుంటే, చంద్రబాబు నిర్మాతగా, నటన, డైలాగులు దత్తపుత్రుడు చెబుతున్నాడని సీఎం జగన్ మండిపడ్డారు. అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని నిసిగ్గుగా వార్తలును ఎల్లోమీడియా రాస్తోందన్నారు. వాస్తవానికి ”వాలంటీర్లలో 60 శాతం నా చెల్లెల్లు ఉన్నారు. వారు సేవా భావంతో పనిచేస్తున్నారు. అలాంటి వాలంటీర్ల క్యారెక్టర్‌ను తప్పుబట్టడం” బాధాకరమని సీఎం జగన్ అన్నారు. ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేసింది పదేళ్లుగా చంద్రబాబు దగ్గర వాలంటర్‌గా పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరికి అండగా ఉంటూ వార్తలు రాస్తోందన్నారు. రాష్ట్రంలోని కోట్ల మందికి వాలంటీర్లు ఎలాంటి వారో తెలుసని… చంద్రబాబు, అతని దత్తపుత్రుడు, సొంత పుత్రుడి క్యారెక్టర్, బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో ప్రజలకు బాగా తెలుసన్నారు.
*బాబుగారి వాలంటీర్ దత్తపుత్రుడు పని ఇదే..*
చంద్రబాబు గారి వాలంటీర్ దత్తపుత్రుడు క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. అతని పని.. అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, వదిలేయడం.. మళ్లీ ఇంకొకరితో పెళ్లి.. మళ్లీ వదిలేయడం.. ఒకరితో వివాహ బంధంతో ఉంటూనే ఇంకొకరికి సహజీవనం సాగిస్తాడు.. ఇది అతని క్యారెక్టర్. ఇక ఇంకొకడు అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చెయ్యాలంటాడు. ఇంకొకడు స్మిమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో తాగి తందనాలు ఆడతాడు. చంద్రబాబు, అతని బావమరిది ఒక షోలో మాట్లాడుతూ.. ఇద్దరూ చేసిన వెదవపనుల గురించి మాట్లాడుకుంటారు. వీరా మంచి చేసే వారి గురించి మాట్లాడేది అని అడుగుతున్నాను. ప్రజలు కూడా వీరి నాటకాలను తెలుసుకుని నమ్మవద్దని కోరతున్నానని సీఎం జగన్ అన్నారు. ఇలా క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాకమరేమిటి? మంచి చేయకుండా ఆపేందుకు ఎన్ని కుయుక్తులు పన్నుతున్నారు ఈ క్యారెక్టర్ లేని వాళ్లు అని జగన్ మండిపడ్డారు. వీరి మెదడులో అన్నీ పురుగులే కనిపిస్తాయి అని.. వీళ్ల పర్సనల్ లైఫ్‌లోనూ, పబ్లిక్ లైఫ్‌లోనూ అంతేనన్నారు.
*ఈ నాలుగేళ్లో మీ బిడ్డ చేసిన మంచి పనులు ఇలా..*
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2.25 కోట్ల రూయాలు సంక్షేమ పథకాలు డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ప్రతి ఏటా 44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ 84 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి. దాదాపు కోటి మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఆసరా. సున్నా వడ్డీ కింద అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడుతున్నమని సీఎం జగన్ పేర్కొన్నారు. ”రైతు భరోసాతో ఇప్పటికే దాదాపు 50 లక్షల పైచిలుకు రైతన్నలకు 31వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, రైతన్న అకౌంట్లలోకి నేరుగా జమ చేయడం. ఇదీ మన చరిత్ర అని సీఎం జగన్ తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా.. అక్కడ వాలంటీర్లు కనిపిస్తారు. సెక్రటేరియట్ వ్యవస్థ, ఆర్బీకేలు, నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయని జగన్ అన్నారు. మేనిఫెస్టో అంటే చంద్రబాబు మాదిరిగా చెత్తబుట్లో పడేయడం కాకుండా.. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి.. 98 శాతం హామీలను నెరవేర్చి గడపగడపకూ తిరిగి మేనిఫెస్టో ప్రతి ఒక్కరి చేతుల్లో పెడుతూ మీ బిడ్డను ఆశీర్వదించండి.. అని అడుగుతున్న చరిత్ర మనదని సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి జరిగింది అనుకుంటే తనను దీవించాలని సీఎం జగన్ కోరారు.
Comments are closed.