The South9
The news is by your side.
after image

యు ఆర్ మై హీరో ” చిత్రాన్ని ఆదరించి హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు..దర్శకుడు షేర్

“యు ఆర్ మై హీరో ” చిత్రాన్ని ఆదరించి హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు..దర్శకుడు షేర్

ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణ లో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై ఫిరోజ్ ఖాన్‌,సనా ఖాన్‌, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ, మేకా రామకృష్ణ,అనంత్ నటీ నటులుగా షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న ,హార్రర్, సస్పెన్స్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ “యు ఆర్ మై హీరో “.ఈ సినిమా జూన్ 17న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మా సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లబించడమే కాక విడుదలైన అన్ని థియేటర్స్ విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్బంగా

చిత్ర నిర్మాత మిన్ని మాట్లాడుతూ.. మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ లో మంచి మెసేజ్ ఉన్నటువంటి సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “యు ఆర్ మై హీరో “.చిత్రానికి అన్ని ప్రాంతాలు,అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తో బిగ్ హిట్ టాక్ వచ్చింది. ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలై వారం అయినా కూడా మా చిత్రం విజయవంతం గా థియేటర్స్ లలో ప్రదర్శింప బడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.ఈ సినిమాలో రైటింగ్, ఫెర్ఫార్మేన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా రెగ్యులర్ సినిమాలా కాకుండా ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇంకా చూడని వారుంటే మా సినిమాను తప్పక చుడండి చూసిన ప్రతీ ఒక్కరికీ కొత్త అనుభూతిని పొందుతారు” అన్నారు.

 

చిత్ర దర్శకుడు షేర్ మాట్లాడుతూ..ఫ్యామిలీ అందరూ కలసి చూసే విధంగా మంచి కంటెంట్ తో తీసిన ఈ చిత్రానికి ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు.నేను ఓన్లీ కంటెంట్ ను నమ్మి ఈ సినిమా తీశాను.ఈ సినిమాకు అందమైన పాటలు, ఫైట్లు అన్నీ సినిమాకు చక్కగా కుదిరాయి. నిర్మాతల సహకారం వల్లే ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యింది.మా సినిమాను అదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

Post Inner vinod found

నటీనటులు

ఫిరోజ్ ఖాన్‌,సనా ఖాన్‌,సంహిత విన్య, ఐశ్వర్య,మిలింద్ గునాజీ,మేకా రామకృష్ణ,అనంత్ తదితరులు

సాంకేతిక నిపుణులు

Post midle

నిర్మాత: మిన్ని,
లైన్ ప్రొడ్యూసర్: టీనా మార్టిన్
సంగీతం, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ & దర్శకత్వం: షేర్
సహాయ దర్శకుడు: నాగు, భవాని, లోవ రాజు, వెంకీ, సుదర్శన్,
సహ దర్శకుడు: రామ్ బాబు, పురం కృష్ణ, అబిద్
అసోసియేట్ డైరెక్టర్: బాలాజీ, డి వెంకట ప్రభు, బొండ్ల రవితేజ.
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కావేటి,
ఎడిటర్: డి వెంకట ప్రభు,
d.i: బాలాజీ,
కొరియోగ్రఫీ: సాయి రాజ్,
గీత రచయిత: బాష్య శ్రీ,
పోరాటాలు: మల్లేష్,
vfx :రవి, ప్రవీణ్ కొమరి,
ప్రొడక్షన్ మేనేజర్: అప్పారావు,
స్టిల్స్: శ్రీనివాస్
కళా దర్శకుడు: ముత్తు
కాస్ట్యూమ్స్ : మెహబూబ్ ఫరెవర్, నవీన్ కుమార్
పి.ఆర్.ఓ. : ఆర్.కె.చౌదరి

Post midle

Comments are closed.